మేకిన్ ఇండియా కు చైనా గండి
ABN, Publish Date - Jul 03 , 2025 | 05:21 AM
భారత్‌పై చైనా ఆర్థిక యుద్ధాన్ని తీవ్రం చేస్తోంది. ఇప్పటికే రేర్ ఎర్త్ మాగ్నెట్లు, ప్రత్యేక ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన చైనా ఇప్పుడు కొత్తగా భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీకి గండి...
ఫాక్స్‌కాన్ నుంచి చైనా ఉద్యోగులు వెనక్కి
న్యూఢిల్లీ: భారత్‌పై చైనా ఆర్థిక యుద్ధాన్ని తీవ్రం చేస్తోంది. ఇప్పటికే రేర్ ఎర్త్ మాగ్నెట్లు, ప్రత్యేక ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన చైనా ఇప్పుడు కొత్తగా భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీకి గండి కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం యాపిల్ కంపెనీ కోసం భారత్‌లో ఐఫోన్లను తయారు చేసే తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీల నుంచి తన ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బందిని వెనక్కి తీసుకుంటోంది. గత రెండు నెలల్లోనే దక్షిణ భారత్‌లోని ఫాక్స్‌కాన్ ప్లాంట్లలో పనిచేసే దాదాపు 300 మంది సాంకేతిక సిబ్బందిని చైనా వెనక్కి తీసుకుంది. అయితే ఈ ఆంక్షల కారణంగా భారత కంపెనీలకు తాత్కాలిక ఇబ్బందులే తప్ప, దీర్ఘకాలికంగా వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండక పోవచ్చని నిపుణుల అంచనా.
ఎందుకంటే ?: కొవిడ్ తర్వాత అమెరికా, ఈయూ, జపాన్ దేశాల కంపెనీలు ‘చైనా+వన్’ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇందులో భాగంగా తమ ఉత్పత్తి యూనిట్లను చైనా నుంచి భారత్, వియత్నాం వంటి దేశాలకు తరలిస్తున్నాయి. యాపిల్ కంపెనీ అయితే ఇప్పటికే తన ఐఫోన్లలో 20 శాతం భారత్ నురచి దిగుమతి చేసుకుంటోంది. వచ్చే ఏడాదికల్లా దీన్ని మరింత పెంచబోతున్నట్టు ప్రకటించింది. దీంతో ప్రపంచ ఫ్యాక్టరీగా తనకున్న ఆధిపత్యం ఎక్కడ చేజారుతుందోనని చైనా భయపడుతోంది. దీనికి తోడు గల్వాన్ సరిహద్దు ఘర్షణల తర్వాత మన దేశం చైనా కంపెనీల పెట్టుబడులపై కఠిన ఆంక్షలు విధించింది. మన టెలికం కంపెనీలు ప్రారంభించిన 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల విస్తరణలోనూ ప్రభుత్వం చైనా కంపెనీలను అనుమతించలేదు. ఈ అక్కసుతోనే చైనా ప్రభుత్వం మన దేశ కంపెనీలకు టెక్నాలజీ బదిలీ, నిపుణులైన సిబ్బంది రాకపోకలపై ఆంక్షలు కట్టుదిట్టం చేస్తోందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 03 , 2025 | 05:21 AM