Share News

Dr Reddys Cancer Drug: డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి కేన్సర్‌ ఔషధం

ABN , Publish Date - Dec 09 , 2025 | 06:14 AM

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్స్‌ మరో సరికొత్త కేన్సర్‌ ఔషధాన్ని మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఇందుకోసం ఇమ్యూటెప్‌ లిమిటెడ్‌ కంపెనీతో...

Dr Reddys Cancer Drug: డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి కేన్సర్‌ ఔషధం

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్స్‌ మరో సరికొత్త కేన్సర్‌ ఔషధాన్ని మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఇందుకోసం ఇమ్యూటెప్‌ లిమిటెడ్‌ కంపెనీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ లైసెన్సింగ్‌ ఒప్పందంపై డాక్టర్‌ రెడ్డీస్‌ అనుబంధ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ఎస్‌ఏ, ఇమ్యూటెప్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ ఇమ్యూటెఎప్‌ ఎస్‌ఏఎస్‌ సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా ఇమ్యూటె్‌పకు చెందిన ఎఫ్టిలాగిమోడ్‌ అల్ఫా అనే కేన్సర్‌ ఔషధాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ ఉత్తర అమెరికా, యూరప్‌, జపాన్‌, గ్రేటర్‌ చైనా దేశాల వెలుపల మార్కెట్‌ చేస్తుంది. ఈ ఔషధం కేన్సర్‌తో పాటు ఇతర ఆటో ఇమ్యూన్‌ వ్యాధులపైనా పోరాడుతుందని రెండు కంపెనీలు ప్రకటించాయి.

ఇవీ చదవండి:

ఏఐతో లేఆఫ్స్ భయాలు.. ఐబీఎమ్ సీఈఓ కీలక కామెంట్స్

ఎస్‌ఐపీ పెట్టుబడుల ఆకర్షణలో పడి ఈ తప్పు చేయొద్దు.. ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధికారి సూచన

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 09 , 2025 | 06:14 AM