Share News

ప్రకృతి నేస్తాలు.. పక్షులు!

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:50 AM

ప్రకృతి అందాలు పక్షులు. ప్రతి రోజు మన చుట్టూ తిరుగుతూ కిలకిలరావాలతో అలరి స్తుంటాయి.

ప్రకృతి నేస్తాలు.. పక్షులు!
కంకులను జడలుగా అల్లుతున్న రైతులు

ఆహారం అందించడానికి వరి కంకుల కుచ్చులు

తయారీలో కళాత్మకం, ఆక్షణీయం

వేల్పూరులో పక్షి ప్రేమిక రైతులు

ప్రకృతి అందాలు పక్షులు. ప్రతి రోజు మన చుట్టూ తిరుగుతూ కిలకిలరావాలతో అలరి స్తుంటాయి. అలాంటి పక్షులకు నేడు కూడు, గూడు కరువైంది. పట్టణీకరణ నేపథ్యంలో పక్షుల ఆవాసాలకు ప్రమాదం ఏర్పడింది. ఇలాంటి తరుణలో పక్షుల ప్రేమికులు వాటి రక్షణకు చర్యలు తీసుకుంటుండటం అభిన ందనీయం. రైతులు కూడా తమ వంతుగా పక్షులు బ్రతకడానికి కృషి చేస్తున్నారు. ఇళ్లు, దేవాలయాలు తదితర ప్రాంతాల్లో పక్షులకు గూళ్లు ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తుం డటం అక్కడక్కడా మనం చూస్తుంటాం.

తణుకు రూర ల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):మన పూర్వీకుల కాలం నుంచి గ్రామీణ ప్రాంతాల రైతులు తమ మొదటి వరి పంట కంకుళ్లు పక్షులకు ఆహారంగా పెద్ద మండువా లోగిళ్లు, దేవాయాల వద్ద, సత్రా ల వద్ద వేలాడదీయడం ఆనవాయితీ వుండేది. అయితే కాల క్రమంలో జీవన విధానంలో వచ్చిన మార్పులు కారణంగా వరి కంకుల కుచ్చులను తయారు చేసే కళ తగ్గిపోవడంతో చాలా వరకు తగ్గిపోయింది. ప్రస్తుతం అక్కడక్కడ కొన్ని గ్రామాల్లోని పాత తరం రైతులు ఇంకా శ్రద్ధ వహించి వరి కంకులను కుచ్చులుగా తయారు చేస్తున్నారు. తణుకు రూరల్‌ మండలం వేల్పూరు గ్రామంలో రైతులు వినాయకుని గుడి వద్ద సార్వా పంటకు సంబంధించిన వరి పనలను సేకరించి వాటిని శుభ్రం చేసి జడలుగా అల్లిన జడలను కుచ్చులుగా తయారు చేసి వాటిని దేవాలయాల వద్ద పిచ్చుకలు వచ్చి తినేలా వేలాడదీస్తున్నా రు. వరి కంకులను ఒక జడలా అల్లడం ఒక కళగా వుంటుంది. అలా జడగా అల్లిన వరి కంకుల జడలను ఒక కుచ్చులా అమర్చడం అనేది ఒక కళాత్మకమైనది. దీనిని గ్రామీణ రైతులు ఎంతో నైపుణ్యంతో, నేర్పుతో తయారు చేస్తారు.

Updated Date - Dec 10 , 2025 | 12:50 AM