సమస్యలు పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:36 PM
సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తానని నెల్లి మర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. మంగళవారం మండలంలోని చాకివలస లో మనప్రజలతో-మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు
భోగాపురం, డిసెంబరు9(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కారానికి కృషిచేస్తానని నెల్లి మర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. మంగళవారం మండలంలోని చాకివలస లో మనప్రజలతో-మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా గ్రామంలో ప్రజలు తాగునీటి ట్యాంకు పనిచేయకపోవడం, రోడ్లు, పారిశుధ్యం, విద్యుత్ సమస్యలు, ఉపాధిపథకం జాబ్‌కార్డులు, తదితర సమస్యలను ఆమెదృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమం లో నాయకులు పల్లంట్ల జగదీష్, పల్లరాంబాబు, బొల్లుత్రినాద్, వందనాల రమణ, పడాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో గాయిత్రీ, కార్యదర్శి అసిరయ్య పాల్గొన్నారు.