Summative Exams 10 నుంచి సమ్మెటివ్ పరీక్షలు
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:16 AM
Summative Exams from 10th Onwards జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 10 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతులకు ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. 6, 8, 10 తరగతులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, 7,9 తరగతులకు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఎస్‌ఏ పరీక్షలను నిర్వహిం చనున్నారు.
సాలూరు రూరల్, నవంబరు3(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 10 నుంచి సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతులకు ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. 6, 8, 10 తరగతులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, 7,9 తరగతులకు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఎస్‌ఏ పరీక్షలను నిర్వహిం చనున్నారు. వాటికి సంబంధించి సోమవారం జిల్లాలో అన్ని ఎంఈవో కార్యాలయాలకు సామగ్రి చేరింది. ఎంఈవోలు వాటిని భద్రపర్చి.. పరీక్షల తేదీల్లో ఆయా పాఠశాలలకు గంట ముందు అందించేందుకు కార్యాచరణ చేస్తున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో ఫార్మెటివ్ అసెస్‌మెంట్ 1కు సంబంధించి రెండు పరీక్షలు పూర్తయ్యాయి. కాగా వివిధ తరగతుల వారికి ఈ నెల 19 వరకు ఎస్‌ఏ పరీక్షలు జరగనున్నాయి.