నక్కపల్లికి నిప్పన్ కంపెనీ ప్రతినిధులు
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:19 AM
జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీ ప్రతినిధుల బృందం మంగళవారం సాయంత్రం నక్కపల్లి మండలంలో పర్యటించింది. లక్సెంబర్గ్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్- జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీ సంయుక్తంగా మండలంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. స్టీల్‌ప్లాంటటు కోసం ప్రభుత్వం బుచ్చిరాజుపేట, చందనాడ, డీఎల్‌పురం, రాజయ్యపేట, వేంపాడు గ్రామాల పరిధిలో 2,164.31 ఎకరాలను కేటాయించింది.
స్టీల్‌ప్లాంటుకు కేటాయించిన భూముల పరిశీలన
నక్కపల్లి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీ ప్రతినిధుల బృందం మంగళవారం సాయంత్రం నక్కపల్లి మండలంలో పర్యటించింది. లక్సెంబర్గ్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్- జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీ సంయుక్తంగా మండలంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. స్టీల్‌ప్లాంటటు కోసం ప్రభుత్వం బుచ్చిరాజుపేట, చందనాడ, డీఎల్‌పురం, రాజయ్యపేట, వేంపాడు గ్రామాల పరిధిలో 2,164.31 ఎకరాలను కేటాయించింది. ఈ మేరకు మంగళవారం నిప్పన్ స్టీల్‌ప్లాంటు ప్రతినిధులు జపాన్ నుంచి విశాఖ వచ్చి, అక్కడి నుంచి నక్కపల్లి చేరుకున్నారు. స్టీల్‌ప్లాంటుకు కేటాయించిన భూములను పరిశీలించారు. వీరి వెంట ఎస్‌ఐ సన్నిబాబు, రెవెన్యూ సిబ్బంది వున్నారు.