ఘనంగా ఐక్యతా యాత్ర
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:42 AM
‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలో ‘యూనిటీ మార్చ్ (ఐక్యతా యాత్ర)’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు.
వల్లభ్‌భాయ్ పటేల్ చూపిన మార్గంలో యువత నడవాలని ఎంపీ రమేశ్ పిలుపు
అనకాపల్లి టౌన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలో ‘యూనిటీ మార్చ్ (ఐక్యతా యాత్ర)’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని శారదా నది వంతెన సమీపంలో ఎంపీ సీఎం రమేశ్ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు వేదికపై పటేల్, భరతమాత చిత్రపటాలకు ఎంపీతోపాటు కలెక్టర్ విజయకృష్ణన్, యూఎఫ్‌ఐడీసీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత దాడి రత్నాకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ రమేశ్ మాట్లాడుతూ, వల్లభ్‌భాయ్ పటేల్ చూపిన మార్గంలో యువతకు ముందుకు వెళుతూ, దేశ ఐక్యతకు పాటుపడాలని అన్నారు. కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ, ‘ఏక్ భారత్.. అత్మనిర్భర్ భారత్’ నినాదం దేశ పౌరులందరినీ ఏకతాటిపైకి తెస్తుందన్నారు. యువతలో ఐక్యత, దేశభక్తి భావన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాలన్నారు. శారదా నది బ్రిడ్జి వద్ద ప్రారంభమైన ర్యాలీ మెయిన్‌రోడ్డు మీదుగా సుంకరమెట్ట జంక్షన్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుహిన్‌సిన్హా, కూటమి నాయకులు సురేంద్రమోహన్, పలకా రవి, మళ్ల సురేంద్ర, డీఎంహెచ్‌వో డాక్టర్ హైమావతి, ఆర్డీవో షేక్ ఆయీషా, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పూజారి శైలజ, కాండ్రేగుల వెంకటరమణ, నాగబోయిన నాగేశ్వరరావు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.