Share News

పెద్దిరెడ్డికి పుంగనూరు పుడింగి పేరు కరెక్టే: పట్టాభిరాం

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:47 AM

సెల్ఫ్‌ డబ్బా కొట్టుకుంటూ దద్దమ్మ పనులు చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి పుంగనూరు పుడింగి అన్న పేరు కరెక్టేనని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభిరాం అన్నారు.

పెద్దిరెడ్డికి పుంగనూరు పుడింగి పేరు కరెక్టే: పట్టాభిరాం

పుంగనూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): సెల్ఫ్‌ డబ్బా కొట్టుకుంటూ దద్దమ్మ పనులు చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి పుంగనూరు పుడింగి అన్న పేరు కరెక్టేనని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభిరాం అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో మంగళవారం టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ పాలనలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి దాడులు, దౌర్జన్యాలతో పుంగనూరును దోచుకుతిన్నారు. చెత్తమీద పన్ను వేసి పుంగనూరులో 23 వేల టన్నుల చెత్తను వదిలేసిన చెత్త ఎమ్మెల్యే పెద్దిరెడ్డి. కూటమి ప్రభుత్వం పుంగనూరును అభివృద్ధి చేస్తుంటే తప్పుడు సమాచారంతో ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్రానికి లేఖలు రాస్తున్నారు’ అని పట్టాభి విమర్శించారు.

Updated Date - Nov 05 , 2025 | 04:48 AM