Share News

పోలీసుల అదుపులో మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థుడు?

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:03 AM

ఓ మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

 పోలీసుల అదుపులో  మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థుడు?

శ్రీకాకుళం క్రైం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఓ మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మెళియాపుట్టి మండలం చాపర రెల్లివీధికి చెందిన దున్న కృష్ణ (50) ఆరు భాషల్లో మాట్లాడుతూ ఇళ్లకు కన్నం వేస్తూ పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడు. జిల్లాలో ఇతనిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆయనను మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమి నల్‌గా గుర్తించి ఇటీవల పోస్టర్లను విడుదల చేశారు. ఇతని సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని, బహుమతి ఇస్తామని పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

Updated Date - Nov 05 , 2025 | 12:03 AM