Share News

త్వరితగతిన సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Nov 03 , 2025 | 11:39 PM

అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆదేశించారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక ‘మీకోసం’ ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 92 ఫిర్యాదులను స్వీకరించారు.

త్వరితగతిన సమస్యలు పరిష్కరించండి
అర్జీదారులతో మాట్లాడుతున్న జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆదేశించారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక ‘మీకోసం’ ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 92 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినతులను అధికారులు స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్ణీత సమయంలోగా అర్జీదారులు సంతృ ప్తి చెందేలా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌కుమార్‌, డిప్యూటీ కలెక్టర్‌ పద్మావతి, డీఆర్‌ డీఏ పీడీ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పూర్తిస్థాయి పింఛన్‌ ఇచ్చి ఆదుకోండి: దివ్యాంగుడి తాత, నాన్నమ్మ వినతి

కోటబొమ్మాళి మండలం వాండ్రాడ గ్రా మానికి చెందిన ముద్దాడ అరవింద్‌ దివ్యాంగుడు. ఏ పనీ చేయ లేని నిస్సహాయుడు.. కనీసం నిలుచోలేని పరిస్థితి.. తల్లిదండ్రులు బతుకుతెరువుకోసం చెన్నై వెళ్లి దురదృష్టవశాత్తు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. దివ్యాంగుడైన అరవింద్‌ను కూలీ పనులు చేసుకునే తాతయ్య జగన్నాథం, నాన్నమ్మ ఆదిలక్ష్మి పోషిస్తున్నారు. పూర్తిస్థాయి పింఛన్‌ను అందజేసి ఆదుకోవాలని వారు జేసీని వేడుకుని వినతిపత్రం అందించారు.

కౌలు రైతులు న్యాయం చేయండి

అకాల వర్షాలతో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు పాడయ్యాయని, కౌలు రైతులకు న్యాయం చేయాలని జిల్లా రైతు సంఘ నాయకులు కోరారు. గ్రీవెన్స్‌లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌కు వినతిపత్రం అందించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద కౌలు రైతులకు రూ.20 వేలు జమ చేయాలని, పంట నష్ట పరిహారం, బీమా, ఈక్రాప్‌ నమోదు, పెట్టుబడి సహాయం అందజేసి ఆదుకోవాలని కోరారు.

రెల్లికుల కమ్యూనిటీ హాల్‌ను మార్చొద్దు

ఆమదాలవలస, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధిలోని 14వ వార్డు ఐజే నాయుడు కాలనీలో ఉన్న రెల్లి కుల కమ్యూనిటీ హాల్‌ను యథావిధిగా కొనసాగించాలని ఆ ప్రాంత వాసులు కోరు తున్నారు. సోమవారం ఈ హాలును సచివాలయంగా మార్పు చే యాలని మునిసిపల్‌ అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు అభ్యంతరం వక్తం చేశారు. ఇదేవార్డులో మరో కమ్యూనిటీ హాల్‌ ఉండగా రెల్లి కమ్యూనిటీ హాల్‌నే సచివాలయంగా మార్పు చేయడంతో ఆంతర్యమేమిటన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందించారు.

అక్రమ కట్టడాన్ని తొలగించాలి

ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి ఆరో వార్డు నంది గిరిపేట పంట కాలువపై నిర్మించిన అక్రమ కట్టడాన్ని వెంటనే తొలగించాలని నాదనాపురం గ్రామానికి చెందిన పాతిన వెంకటరమణ తదితరులు కోరారు. ఈ మేరకు సోమవారం జేసీకి వినతిపత్రం అందించారు. నాదనాపురం మీదుగా సీపాన చంద్రయ్యపేటలోని చెరువును కలుపుతూ వెళ్లే పిల్ల కాలువపై ఓ వ్యక్తి అక్రమంగా ఇంటిని నిర్మించారని, దీనివల్ల పొలాలకు సాగునీరందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 11:40 PM