తెగుళ్ల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:38 PM
మొంథా తుఫాన్ నేపథ్యంలో వరదనీటితో ముంపునకు గురైన పంట పొలాల్లో తెగుళ్ల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డి.ఉదయ్‌కుమార్, భాగ్యలక్ష్మి సూచించారు.
కవిటి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ నేపథ్యంలో వరదనీటితో ముంపునకు గురైన పంట పొలాల్లో తెగుళ్ల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డి.ఉదయ్‌కుమార్, భాగ్యలక్ష్మి సూచించారు. పి. కొజ్జిరియా ప్రాంతంలో మంగళవారం పర్యటించి పంటలను పరిశీలించారు. పొడతెగులు, ఆకుముడత తెగుళ్లు సోకనట్లు గుర్తిచామన్నారు. వరదనీటిని తొలగించి హెగ్జాకోనాజోల్ రెండు మి.లీ., అసిపేట్ 1.5 గ్రాముల మందును నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. మందుల వాడకంతో పంటకు ఎలాం టి నష్టం వాటిల్లకుండా దిగుబడికి ఇబ్బంది లేకుండా ఉంటుం దన్నారు. వారితో పాటు ఏడీఏ టి.భవానీశంకర్, ఏవో పి.శ్రీదేవి తదితరులున్నారు.