Share News

అవగాహన లేకనే కేంద్ర మంత్రిపై విమర్శలు

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:46 PM

అవగా హన లేకనే వైసీపీ నాయకులు.. కేంద్ర విమానాయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుపై విమర్శలు చేస్తున్నారని కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు అన్నారు.

అవగాహన లేకనే కేంద్ర మంత్రిపై విమర్శలు
మాట్లాడుతున్న కళింగ వైశ్య వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గోవిందరాజులు తదితరులు

కోటబొమ్మాళి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): అవగా హన లేకనే వైసీపీ నాయకులు.. కేంద్ర విమానాయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుపై విమర్శలు చేస్తున్నారని కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇండిగో సంస్థ వివిధ కారణాలతో విమానాలు నడపకపోతే, దానికి కేంద్ర మంత్రి రామ్మోహన్‌ ఎలా బాధ్యులవుతారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని రాజ్య సభలో మంత్రి స్పష్టంగా వివరించారని, అందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు మంత్రులు అభినందించారని అన్నారు. ఈ విషయం వైసీపీ నాయకులు తెలుసుకోకుండా అవగాహన లేకుండా రామ్మోహన్‌పై బురదజల్లడం తగదన్నారు. ఆయన్ను విమర్శించే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. ఈ సమావేశంలో కళింగ వైశ్య డైరెక్టర్‌ జామి వైకుంఠరావు, నీటి సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, పీఏసీఎస్‌ డైరెక్టర్లు సాసుమంతు ఆనంద రావు, ఎస్‌.రాంకుమార్‌, పట్టణ అధ్యక్షుడు కోరాడ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 11:46 PM