ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరుగురికి కందుకూరి విశిష్ట సేవ పురస్కారాల ప్రదానం

ABN, Publish Date - Apr 17 , 2025 | 12:36 AM

విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కందుకూరి 177వ జయంతిని పురస్కరించుకుని బుధవారం తెలుగు నాటక రంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నాటక రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 113 మందికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ చేతుల మీదుగా కందుకూరి విశిష్ట సేవ పురస్కారాలను ప్రదానం చేశారు.

విజయవాడ కల్చరల్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) :

విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కందుకూరి 177వ జయంతిని పురస్కరించుకుని బుధవారం తెలుగు నాటక రంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నాటక రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 113 మందికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ చేతుల మీదుగా కందుకూరి విశిష్ట సేవ పురస్కారాలను ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష బహుమానం, జిల్లాస్థాయి పురస్కారాలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున బహుమతులు అందించారు. కృష్ణాజిల్లాకు చెందిన బెత్తిన శివప్రసాద్‌, గాజులపల్లి కృష్ణ, జొన్నలగడ్డ జగన్మోహనరావు, ఎన్‌.ఉదయ్‌ భాస్కర్‌, తీట్ల రాజబాబు, బి.జయప్రకాష్‌ తదితరులు ఈ పురస్కారాలను అందుకున్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:36 AM