ప్రగతి పరుగులు
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:46 PM
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది.
పారిశ్రామిక నగరిగా ఓర్వకల్లు
రూ.2,786 కోట్లతో ఇండసి్ట్రయల్ నోడ్ అభివృద్ధి
పరిశ్రమలకు గేట్‌వేగా సీమ ముఖద్వారం
340 ఎకరాల్లో డ్రోన సిటీ
రేపు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
సెమీకండక్టర్ యూనిట్ సహా పలు పరిశ్రమలకు ఒప్పందం
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. పరిశ్రమలకు గేట్‌వేగా మార్చాలని సీఎం చంద్రబాబు సంకల్పం. రాష్ట్ర విభజన తరువాత ఓర్వకల్లు కేంద్రంగా పారిశ్రామిక హబ్ అభివృద్ధికి ప్రత్యేక కృషిచేశారు. ప్రపంచంలోనే తొలి వెయ్యి మెగావాట్ల సోలర్ పవర్ యూనిట్ ప్రారంభించారు. పంప్డ్ స్టోరేజ్ విద్యుత యూనిట్‌కు బీజం వేశారు. జైరాజ్ ఇస్పాత ఐరన పరిశ్రమలకు భూమి పూజచేశారు. ఒప్పందం చేసుకున్న వివిధ పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు ఇసుమంత అభివృద్ధి జరగలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఓర్వకల్లు పారిశ్రామిక దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం దన్నుగా నిలిచింది. డ్రోన సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక నగరి ఓర్వకల్లు’పై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ జిల్లాల్లో కరువు, వలసలు నివారించాలంటే పారిశ్రామిక ప్రగతి, ప్రాజెక్టులు ముఖ్యమని సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. 2014-19 మధ్య ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పారిశ్రామిక ప్రగతి సాఽధించాలని అప్పటి సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టిసారించారు. ఓర్వకల్లు పారిశ్రామిక హబ్, కొలిమిగండ్ల సిమెంట్ హబ్, నందికొట్కూరు మెగా సీడ్ హబ్ అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించారు. ఆదిశగా వేగంగా అడుగులు వేశారు. ఓర్వకల్లు హబ్ కేంద్రంగా ఆసియాలోనే అదిపెద్ద వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేశారు. జైరాజ్ ఇస్పాత స్టీల్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే తొలి పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ పవర్ ఉత్పత్తి యూనిట్ 3,230 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుకు నాంది పలికారు. నందికొట్కూరు దగ్గర మెగా సీడ్ హబ్, జైన ఇరిగేషన ప్లాంట్‌కు శ్రీకారం చుట్టారు.
వైసీపీ హయాంలో ప్రగతి ఎండమావిగా..
ఒక్కో పరిశ్రమ పట్టాలు ఎక్కుతున్న సమయంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. పారిశ్రామిక ప్రగతి ఎండమావిగా మారింది. ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయకుండానే వెనకడుగు వేశారు. ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటుకు కా లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా చేయూతగా నిలిచింది. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు ఒక్కొక్కటిగా ఓర్వకల్లు వైపు అడుగుల వేస్తున్నాయి. కీలకమైన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందన వారే కావడం పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇచ్చింది.
2,612ఎకరాల్లో ఇండసి్ట్రయల్ స్మార్ట్ సిటీ..
హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ (హెచబీఐసీ)లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద 2,612ఎకరాల్లో రూ.2,786 కోట్లతో ఓర్వకల్లు ఇండసి్ట్రయల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి కేంద్రం ముం దుకొచ్చింది. నేషనల్ ఇండసి్ట్రయల్ కారిడార్ డెవల్‌పమెంట్ ప్రొ గ్రామ్ (ఎనఐసీడీపీ)లో భాగంగా ఇండసి్ట్రయల్ స్మార్ట్ సిటీల అభివృద్ధికి కేంద్రం ఆమోదం ముద్రవేసింది. దీని వెనుకు సీఎం చంద్రబాబు, విద్య, ఐటీ శాఖమంత్రి నారా లోకేశ కృషి ఎంతోఉంది. ఫేజ్-1 కింద 2,612ఎకరాల్లో ఓర్వకల్లు ఇండసి్ట్రయల్ సిటీలో రూ.2,786 కోట్లతో మౌలిక వసతులు కల్పించేందుకు ఇప్పటికే టెండర్లు కూడా పూర్తిచేశారు. ఇక్కడ నాన మెటలిక్ మినరల్ పరిశ్రమలు, ఆటోముబైల్ రంగం విడిభాగాలు తయారి, పునరుత్పాదక పరిశ్రమలు, ఎలకి్ట్రకల్ అండ్ ఎలకా్ట్రనిక్ పరికరాలు, ఏరోస్పెస్ అండ్ డిషెన్స హార్డ్‌వేర్, ఫార్మాస్యూటికల్స్, వజ్రాలు, బంగారు ఆభరణాల తయారీ, వస్త్ర ఉత్ప త్తి రంగ పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు నేషనల్ ఇండసి్ట్రయల్ కారిడార్ డెవల్‌పమెంట్ కార్పోరేషన(ఎనఐసీడీసీ) ప్రత్యేక దృష్టిని పెట్టిం ది. ఆయా పరిశ్రమలు ఏర్పాటు ద్వారా రూ.12వేల కోట్లు పెట్టుబడులు, 45,071మంది యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని ల క్ష్యం. ఈపనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు.
నవ్యాంధ్రను డ్రోన హబ్‌గా..
నవ్యాంధ్రను డ్రోన హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి చేస్తున్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తుంది. రాష్ట్రాన్ని డ్రోన హబ్‌గా మా ర్చాలని ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ పరిధిలో పాలకొనను, చింతలపల్లి, కొమ్మరోలు గ్రామా ల్లో 340 ఎకరాల్లో డ్రోన సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. డ్రోన సిటీ అభివృద్ధి చేస్తే డ్రోన్ల తయారీ అసెంబుల్ యూనిట్లు, రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్, టెస్టింగ్ అండ్ ఫ్లయింగ్ జోన, డ్రోన పైలెట్ ట్రైనింగ్ సెంటర్, డ్రోన టెస్టింగ్ ట్రాక్, డ్రోన్ల మరమ్మతు కేం ద్రాలు వచ్చే అవకాశముంది. ఆయా విభాగాల్లో దాదాపు రూ.2వేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని, తద్వారా 8-10 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఏపీఐఐసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి డ్రోన హబ్ ఏపీలో ఏర్పాటు కాబోతుండడం, అందుకు ఓర్వకల్లు వేదిక కావడంతో కర్నూలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ‘ఓర్వకల్లు డ్రోన సిటీ’ నిర్మాణానికి రేపు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు.
జపనీస్ సంస్థతో పాటు మరో ఐటీ..
ఓర్వకల్లు మెగా ఇండసి్ట్రయల్ హబ్‌లో జపనీస్ సంస్థ, భారతకు చెందిన మరో ఐటీ సంస్థ భాగస్వామ్యంతో 130ఎకరాల్లో రూ.14 వేల కోట్లతో భారీ సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికే జపాన ప్రతినిధులు ఓర్వకల్లును పరిశీలించారు. ఈ పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యేక్షంగా, పరోక్షంగా 15 వేల మందికి ఉపాధి లభించనుంది. 1,200 ఎకరాల్లో ఈవీ హబ్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.13వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అంచనా.
రిలయన్సతో పాటు మరి కొన్ని సంస్థలు..
ఓర్వకల్లు కేంద్రంగా రూ.758కోట్లతో రిలయన్స కన్స్యూమర్ ప్రొడెక్ట్ సంస్థ వివిధ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణ యం తీసుకుంది. దీంతో 500 మందికి ఉపాధి లభించనుంది. కాల్వ గ్రామంలో ఉన్న ఫ్రెష్ బౌల్ హర్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.33 కోట్లతో విస్తరించనుంది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే అలీప్ సంస్థ రూ.36.35కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముం దుకు వచ్చింది. ఇటీవలే అవసరమైన భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇలా ఓర్వకల్లు కేంద్రంగా పలు పరిశ్రమలు ఒప్పందం చేసుకోగా, మరిన్ని సంస్థలు ముందుకు రాబోతున్నాయి.
16న 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన..
ఈ నెల 16న ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జాతీయ రహదారులు, రైల్వే, రక్షణ, పారిశ్రామిక, పవర్, ఇంధన సంస్థ వంటి శాఖ దాదాపు రూ.13,429 కోట్ల అంచనాలతో నిర్మించబోయే 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈమేరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నారు. ఓర్వకల్లు ఇండసి్ట్రయల్ నోడ్‌తో పాటు కర్నూలు పీఎస్-3 వద్ద పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం రూ.2,886కోట్లతో అదనపు వపర్ గ్రిడ్ నిర్మాణం కోసం పునాది రాయి వేయనున్నారు.