Share News

దళితుల ఐక్యతతోనే రాజ్యాంగ పరిరక్షణ

ABN , Publish Date - Sep 18 , 2025 | 11:06 PM

దళితులు ఐక్యతతోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ అన్నారు. గురువారం సాయంత్రం టంగుటూరులోని అంబేడ్కర్‌ నగర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.

దళితుల ఐక్యతతోనే రాజ్యాంగ పరిరక్షణ
అంబేద్కర్‌నగర్‌లో ర్యాలీగా వెళ్తున్న చింతా మోహన్‌, నాయకులు

మాజీ ఎంపీ చింతా మోహన్‌

టంగుటూరు(కొండపి), సెప్టెంబరు18 (ఆంధ్రజ్యోతి): దళితులు ఐక్యతతోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ అన్నారు. గురువారం సాయంత్రం టంగుటూరులోని అంబేడ్కర్‌ నగర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా అంబేడ్కర్‌నగర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన స్థానికులతో మాట్లాడారు. అనంతరం చింతామోహన్‌ను నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్‌బాబు, రాష్ట్ర నాయకుడు చితామణి, సంఘం జిల్లా అధ్యక్షుడు ఏడుకొండలు, రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు, రాష్ట్ర మాలల జేఏసీ నాయకుడు లాయర్‌ బాల నారాయణ, మేడిద రవి, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 11:06 PM