Share News

లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోండి

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:11 PM

లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోండి

  లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోండి
కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 9 (ఆంధ్ర జ్యోతి): ఉమ్మడి జిల్లాలో అనధికార లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని కర్నూలు అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (కుడా) చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు. మంగళవారం కుడా కార్యాలయంలో ఆ యన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే 14 నియోజకవర్గాల్లో అనఽఽధికారింగా ఉన్న లేఅవుట్లు, ప్లాట్లకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు. మంత్రాలయంలో అనేక లాడ్జీలు నిర్మించారని తనిఖీకి వెళ్లి యజమానులను అనుమతులు ఎవరు ఇచ్చారంటూ ఆరా తీశామన్నారు. పంచాయతీ అనుమతి కేవలం ఇంటి నిర్మాణం కోసమే ఉం టుందని, వాణిజ్య సముదాయాలకు కుడా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. భవనాలు నిర్మించి కమర్షియల్‌గా వాడుకుంటున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నా రు. పంచాయతీ అనుమతి తీసుకున్న వారందరూ కుడా కార్యాలయానికి వచ్చి అనుమతి తీసుకోవాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ స్వయంగా తీసుకోకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని సోమిశెట్టి హెచ్చరించారు.

Updated Date - Dec 09 , 2025 | 11:11 PM