Share News

ఎంపీ జోక్యంతో సమస్య పరిష్కారం

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:09 AM

ఎంపీ బస్తిపాటి నాగరాజు జోక్యంతో పత్తి రైతుల సమస్య పరిష్కరమైంది. సోమవారం పెంచికలపాడు సీసీఐ కేంద్రంలో పత్తి కోనుగోల్లు ఆగిపోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించారు.

ఎంపీ జోక్యంతో సమస్య పరిష్కారం
రైతులతో మాట్లాడుతున్న ఎంపీ నాగరాజు

గూడూరు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎంపీ బస్తిపాటి నాగరాజు జోక్యంతో పత్తి రైతుల సమస్య పరిష్కరమైంది. సోమవారం పెంచికలపాడు సీసీఐ కేంద్రంలో పత్తి కోనుగోల్లు ఆగిపోవడంతో రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రాప్‌లో నమోదు చేసుకుని, కిసాన్‌ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోగా మెసేజ్‌ రావడంతో రైతులు సోమవారం సీసీఐ కేంద్రానికి పత్తి లోడ్‌ను తీసుకొచ్చారు. తీరా ఇక్కడకు రాగా, తమకు వివరాలు రాలేదంటూ సీసీఐ కేంద్రం అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహించి రోడ్డుపై బైఠాయిం చారు దీంతో వాహనాలు నిలిచిపోయాయి. అటుగా వెళ్తున్న ఎంపీ ఆగి, సమస్యను తెలుసుకుని, సీసీఐ కేంద్రానికి వెళ్ళి అధికారులతో మాట్లాడారు. ఢిల్లీలోని సీసీఐ అధికారులతో మాట్లాడి, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళారు. సరిచేయడంతో పత్తికొనుగోళ్లు ప్రారంభించారు

Updated Date - Nov 04 , 2025 | 01:09 AM