Share News

విద్యుత్‌ బిల్లు చూస్తేనే షాక్‌

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:34 PM

రైస్‌ మిల్లు ప్రారంభం కాక ముందే విద్యుత్‌ బిల్లు మోత మోగింది. రూ.57,323 కరెంటు బిల్లు వచ్చింది. ఇదేమిటి రైస్‌మిల్లు ప్రారంభం కాకముందే ఇంత విద్యుత్‌ బిల్లు రావడంతో యజమాని ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.

విద్యుత్‌ బిల్లు చూస్తేనే షాక్‌
బిల్లు చూపుతున్న మిల్లు యజమాని

రైస్‌ మిల్లు ప్రారంభం కాక ముందే బిల్లు

ఖంగుతిన్న యజమాని

నందికొట్కూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): రైస్‌ మిల్లు ప్రారంభం కాక ముందే విద్యుత్‌ బిల్లు మోత మోగింది. రూ.57,323 కరెంటు బిల్లు వచ్చింది. ఇదేమిటి రైస్‌మిల్లు ప్రారంభం కాకముందే ఇంత విద్యుత్‌ బిల్లు రావడంతో యజమాని ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వివరాలు.. మండలంలోని బిజినవేముల వద్ద ముబా రక్‌ మొదీర్న్‌ యు.ఎ్‌స.సీ నెం: 8532212001306 కు రూ.57,323 బిల్లు గత శనివారం వచ్చింది. బిల్లు చూసిన యజమాని అబ్దుల్‌ హమీద్‌ ఒక్కసారిగా షాక్‌కు గుర య్యారు. గత నెలలో రైస్‌ మిల్‌ మరమ్మతు పనులు చేస్తేనే రూ.21,771 వచ్చింది. ఈ నెలలో ఎలాంటి పనులు చేయలేదని, ఇంకా రైస్‌మిల్లు కూడా ప్రారంభం కాకముందే ఇంత విద్యుత్‌ బిల్లు రావడంతో ఏమిటో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఇలా విద్యుత్‌ బిల్లులు వస్తే రైస్‌ మిల్లు నిర్వహించే కన్నా ఏపీఎస్పీడీసీఎల్‌ వారిసే రాసి ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. ఈవిషయంపై విద్యుత్‌ ఏ.ఈ. రాములునాయక్‌ను వివరణ కోరగా రైస్‌ మిల్‌ యజమాని మాకు ఫిర్యాదు చేశారు. వర్షం కారణంగా ఈ రోజు వెరిఫికేషన్‌కు వెళ్లలేదు. కొత్త రైస్‌మిల్‌ కావడంతో విద్యుత్‌ కెపాసిటర్‌లు కం టిన్యూగా ఆన్‌లోనే ఉంచడంతో రీడింగ్‌ పెరిగి ఉంటుందన్నారు. బుధవారం రైస్‌మి ల్లును తనిఖీచేసి మీటరు రీటింగ్‌ను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:34 PM