పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:14 PM
సింగిల్ డెస్క్ ద్వారా అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పరిష్కరించి, నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, డిసెంబరు9(ఆంధ్రజ్యోతి) : సింగిల్ డెస్క్ ద్వారా అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పరిష్కరించి, నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వీడి యో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోఽత్సాహక కమిటీ సమావేశఽం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు వచ్చిన ఆర్జీలను తిరిగి పంపకుండా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఆర్ కృష్ణాపురంలోని హస్తకళల స్టోన్ మర్చెంట్‌లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కోసం నాలుగు కొత్త ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. పీఎంఈజీపీ కింద కేటాయించిన 137 లక్ష్యాలలో కేవలం 59 మాత్రమే పూర్తి అయ్యాయని, మిగిలినవి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా అర్హులైన వారికి ఆర్థిక సాయం కల్పించాలని బ్యాంకర్లను కోరారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ, విధ్యుత్ చార్జీ సబ్సిడీ తదితర పథకాల ద్వారా జిల్లాలో 9యూనిట్లకు రూ 35.41 లక్షల విలువైన రాయితీ ప్రయోజ నాలను కమిటీ ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ మహబూబ్‌బాషా, ఎల్‌డీఎం రవీంద్రకుమార్, డీఆర్డీఎ ప్రాజెక్ట్ పీడీ శ్రీధర్‌రెడ్డి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.