చెరువులో నీరున్నా..ఉపయోగం లేదన్నా
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:29 AM
మండలంలోని జొన్నగిరి చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండింది. అయినా రైతులకు ఉపయోగం లేకుండా పోయింది. దాదాపు 192 ఎకరాల ఆయకట్టు భూముల్లో కంపచెట్లు ఉండటంతో నిరుపయోగంగా మారింది
పూర్తిగా నిండిన జొన్నగిరి చెరువు
ముళ్లకంపతో నిండిన 192 ఎకరా భూమి
అభివృద్ధి చేస్తే సాగుచేయొచ్చంటున్న రైతులు
తుగ్గలి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జొన్నగిరి చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండింది. అయినా రైతులకు ఉపయోగం లేకుండా పోయింది. దాదాపు 192 ఎకరాల ఆయకట్టు భూముల్లో కంపచెట్లు ఉండటంతో నిరుపయోగంగా మారింది. 20 ఏళ్ల క్రితం వరి పండించేవారమని, వర్షాలు కురువకపోవడం, ఇతర చెరువుల నుంచి నీరు చేరకపోవడంతో 368 మంది రైతులకు పొలాలు భూములు బీడుబారాయి. అనంతరం ఎవరూ పట్టించుకోకపోవడంతో ముళ్ల కంప పెరిగింది. బీడ్లువారి కంపచెట్లు పెరిగిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వంలో చెరువుల మరమ్మతులు చేసి, ఆయకట్టును పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము శుభ్రం చేసుకోవాలంటే రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని తమ వల్ల కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కంపచెట్లు తొలగించి ఆయకట్టును సాగులోకి తీసుకురావాలని అందించాలని రైతులు కోరుతున్నారు.
నిధులు ఇవ్వాలి
ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ఆయక ట్టులో కంప తొలగిస్తాం. చెరువును అభివృద్ధి చేసి, గతంలో మాదిరిగానే పంటలు సాగుచేసే అవకాశం ఉంది. ఫ గుంత రంగస్వామి, సాగునీటి సంఘం అధ్యక్షుడు, జొన్నగిరి