విరుచుకుపడ్డ కొండ చరియలు
ABN , Publish Date - Nov 04 , 2025 | 10:53 PM
శ్రీశైల క్షేత్ర పాతాళగంగ, డ్యాంసైట్ వ్యూ పాయింట్ టర్నింగ్ సమీపంలో కొండ చరియలు విరుచుకొని రోడ్లపై పడ్డాయి.
శ్రీశైలం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్ర పాతాళగంగ, డ్యాంసైట్ వ్యూ పాయింట్ టర్నింగ్ సమీపంలో కొండ చరియలు విరుచుకొని రోడ్లపై పడ్డాయి. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో రోడ్డుపై పడిన కొండరాళ్లను తొలగించే వరకు రాకపోకలు నిలిచిపోయాయి. వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల సంభవించే ప్రమాదాలబారిన పడకుండా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సున్నిపెంట ఇన్‌స్పెక్టర్ చంద్రబాబు సూచించారు.