మార్మోగిన శివాలయాలు
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:16 AM
కార్తీక రెండవ సోమవారం సందర్భంగా పట్టణంలోని అన్ని శివాలయాలలో భక్తులు ప్రాత:కాల పూజలు నిర్వహించారు.
కిటకిటలాడిన ఆలయాలు
కార్తీక పూజలు చేసిన భక్తులు
దీపాలు వెలిగించిన మహిళలు
నంద్యాల కల్చరల్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కార్తీక రెండవ సోమవారం సందర్భంగా పట్టణంలోని అన్ని శివాలయాలలో భక్తులు ప్రాత:కాల పూజలు నిర్వహించారు. ప్రఽథమనందీశ్వరాలయంలో శివయ్యను దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు, ఆకాశదీపాలను వెలిగించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతలకు నిర్వాహకులు సన్మానించారు. వేదపండితులు ఆశీర్వాదించారు. కార్యక్రమంలో ఈవో చంద్రుడు, చలంబాబు, అర్చకులు ప్రవీణ్‌కుమార్, భక్తులు పాల్గొన్నారు.
బండిఆత్మకూరు: నల్లమల అటవీ ప్రాంతంతో వెలసిన ఓంకార క్షేత్రం ఓంకార నాదంతో హోరెత్తింది. పవిత్ర కార్తీకమాసం రెండవ సోమవారం జిల్లాలోని పలుప్రాంతల నుంచి భక్తులు తరలివచ్చారు. గంగా,ఉమా సమేత సిద్ధేశ్వర స్వామి అభిషేకాలు, అర్చనలు, సహస్రనామ భిల్వార్చన చైర్మన చెన్నారెడ్డి, ఈవో ఆకృతి నాగప్రసాద్‌ల సమక్షంలో అర్చకులు నిర్వహించారు. స్వామివార్లను భక్తులు దర్శించుకొని అభయాంజనేయ స్వామి కట్టపైన కార్తీక దీపాలు వెలిగించారు. కొండలపై వెలసిన పద్మావతి సహిత శ్రీనివాస, కామాక్షి అమ్మవారి ఆలయాలను భక్తలు దర్శించుకున్నారు. భక్తులకు కాశిరెడ్డినాయన ఆశ్రమంలో, బండిఆత్మకూరు వారాధి సమీపాన వీరభధ్ర స్వామి వద్ద నిర్వాహకులు అన్నదానం చేశారు.
ఆత్మకూరు: పట్టణంలోని వేంకటేశ్వరుడి ఆలయంలో సోమవారం కార్తీక మాసోత్సవ క్రతువును శాస్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వున్న ఉసిరి, తులసిచెట్లకు పూజలు చేశారు. సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు అనిల్‌కుమార్, శ్రీశైలం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన వంగాల శివరామిరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు రామయ్య, భక్తులు పాల్గొన్నారు.
గడివేముల: మండలంలోని గడిగరేవుల గ్రామ సమీపంలో వెలసిన దుర్గాభోగేశ్వర ఆలయం కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ప్రధాన అర్చకుడు శ్యామ్‌సుందర్‌శర్మ దుర్గాభోగేశ్వరుడికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. గిరిధర్‌శర్మ త్రిపురాంబ సమేత పాలకేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు.