రూ.500కోట్లతో త్వరలో ఇంట్రామోడల్ బస్సు టర్మినల్
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:53 AM
దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక హుంగులతో తిరుపతి నగరంలో రూ.500కోట్లతో ఇంట్రా మోడల్ బస్సు టర్మినల్ అతి త్వరలో నిర్మించబోతున్నామని రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు.
- రవాణా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
తిరుపతి(ఆర్టీసీ), నవంబరు 3(ఆంధ్రజ్యోతి): దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక హుంగులతో తిరుపతి నగరంలో రూ.500కోట్లతో ఇంట్రా మోడల్ బస్సు టర్మినల్ అతి త్వరలో నిర్మించబోతున్నామని రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన అలిపిరి రోడ్డులో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ వైద్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రూ. 1.90కోట్లతో అధునాతన సౌకర్యాలతో వైద్యశాల, శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే ఆర్టీసీ ప్రముఖులు, అధికారులు, అతిథుల కోసం రూ.2కోట్లతో విశ్రాంతి గదులు నిర్మించామన్నారు. ఆర్టీసీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆర్టీసీలో ప్రమాదాల నివారణకు చట్టాలను కఠినతరం చేయనున్నట్లు చెప్పారు. కర్నూలులో బస్సు ప్రమాదం తర్వాత చట్టాలను కఠినతరం చేస్తున్నామన్నారు. ఫిట్‌నెస్ లేని బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నామన్నారు. వందశాతం ప్రమాణాలు కలిగిన బస్సులు మాత్రమే రోడ్డెక్కేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆర్ అండ్ బీ, హైవే్‌సలో ఎక్కువ ప్రమాదాలు జరిగే స్థలాలను బ్లాక్‌స్పాట్స్‌గా గుర్తించి, అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచన చేస్తున్నామన్నారు. అంతకుముందు ఆయన వైద్యశాలను, ఎండీ ద్వారక తిరుమలరావు గెస్ట్‌హౌ్‌సను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, కడప, నెల్లూరు జోనల్ చైర్మన్లు పూల నాగరాజు, సన్నపురెడ్డి సురే్‌షరెడ్డి, ఈడీలు చెంగల్‌రెడ్డి, చంద్రశేఖర్, రవివర్మ, చీఫ్ ఇంజనీర్ వెంకటరమణ పాల్గొన్నారు.