Share News

పారిశ్రామిక జోష్‌

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:18 AM

రెండు ఎంఎ్‌సఎంఈ పార్కుల అభివృద్ధికి.. ప్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ నిర్మాణానికి.. దమ్ము బయో ఫ్యూయెల్స్‌ ప్లాంట్‌.. ఈ మూడింటికి మంగళవారం సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

పారిశ్రామిక జోష్‌
ఎంఎ్‌సఎంఈ పార్కుకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, ఆర్డీవో భానుప్రకాశ్‌రెడ్డి

సీఎం చంద్రబాబుచే వర్చువల్‌గా శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు

రెండు ఎంఎ్‌సఎంఈ పార్కుల అభివృద్ధికి.. ప్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ నిర్మాణానికి.. దమ్ము బయో ఫ్యూయెల్స్‌ ప్లాంట్‌.. ఈ మూడింటికి మంగళవారం సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. తిరుచానూరు వద్ద ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను, పాలచ్చూరులో ఫార్మా కంపెనీకి ప్రారంభోత్సవం చేశారు. ఇలా గూడూరు, పెళ్లకూరు, వరదయ్యపాళెం, తిరుపతి రూరల్‌ మండలాల్లో శంకుస్థాపనలు, ప్రాంభోత్సవాలతో పారిశ్రామిక జోష్‌ కనిపించింది. ప్రత్యక్షంగా పెళ్లకూరులో మంత్రి నిమ్మల రామానాయుడు, మిగతా చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని శిలాఫలకాలను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వంతో పెట్టుబడులు రావడంతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

శంకుస్థాపనలు

కొమ్మనేటూరు ఎంఎ్‌సఎంఈ పార్కు

ఎక్కడ: గూడూరు మండలం కొమ్మనేటూరు సమీపం

విస్తీర్ణం: 43.10 ఎకరాలు

ప్లాట్లు: 129

మొదటి దశ: 20 ఎకరాలు.. రూ.9.65 కోట్లతో పనులు

శంకుస్థాపన చేసింది: వర్చువల్‌ విధానంలో సీఎం చంద్రబాబు

ప్రత్యక్షంగా పాల్గొంది: ఎమ్మెల్యే పాశిం సునీల్‌ కుమార్‌, ఆర్డీవో భానుప్రకాశ్‌రెడ్డి, నెలబల్లి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లురాజు, మట్టం శ్రావణి, అల్లూరు కరుణాకర్‌రెడ్డి, ఎల్లసిరి శ్రీనివాసులురెడ్డి, బిల్లు చెంచురామయ్య, అబ్దుల్‌ రహీమ్‌, పెంచలయ్య, సురేంద్ర, బత్తిన ప్రణీత్‌, తహసీల్దారు ప్రసాద్‌ తదితరులు

ఏం చెప్పారు: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎ్‌సఎంఈ) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటివి. నిరుద్యోగులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎంఎ్‌సఎంఈ పార్కులను అభివృద్ధి పరుస్తున్నార్న ఎమ్మెల్యే, ఆర్డీవో.

- గూడూరు, ఆంధ్రజ్యోతి

ప్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ (ఎఫ్‌ఎ్‌ఫసీ)

ఎక్కడ: వరదయ్యపాళెం మండలం చిన్నపాండూరు

అంచనా వ్యయం: రూ.16.78 కోట్లు

ప్రత్యక్షంగా పాల్గొంది: భూమిపూజలో ఎమ్మెల్యే ఆదిమూలం, సర్పంచి శ్యామల, ఎంపీటీసీ సభ్యురాలు భువనేశ్వరి, పరిశ్రమల జెడ్‌ఎం చంద్రశేఖర్‌, తహసీల్దారు సుధీర్‌, ఎంపీడీవో విజయలక్ష్మి, శ్రీసిటీ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ నేతలు బండారి, జయశంకర్‌రెడ్డి, భవన నిర్మాణ కార్మిక నేత కోటేశ్వరరావు, అపోలో పరిశ్రమ ప్లాంట్‌ ఎస్‌వో సాయిబాబు.

ఏం చెప్పారు: చంద్రబాబు సీఎం అయ్యాక పెట్టుబడులు ఊపందుకున్నాయి. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్రంలో శాశ్వత అభివృద్ధికి కృషి జరుగుతోందన్నారు ఎమ్మెల్యే.

- వరదయ్యపాళెం, ఆంధ్రజ్యోతి

శిరసనంబేడు ఎంఎ్‌సఎంఈ

ఎక్కడ: పెళ్లకూరు మండలం శిరసనంబేడు గ్రామం

విస్తీర్ణం: 58.33 ఎకరాల సేకరణ. మొదటి విడతలో 22.42 ఎకరాల్లో అభివృద్ధి.

పెట్టుబడి: రూ.5.5 కోట్లు.

ఉపాధి: ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి.

లక్ష్యం: ఎంఎ్‌సఎంఈ పార్కు అభివృద్ధితో సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం కల్పించడం.

- పెళ్లకూరు, ఆంధ్రజ్యోతి

దమ్ము బయో ఫ్యూయెల్స్‌ ప్లాంట్‌

ఎక్కడ: పెళ్లకూరు మండలం పాలచ్చూరు- శిరసనంబేడు పారిశ్రామికవాడ

పెట్టుబడి: రూ.300 కోట్లతో శంకుస్థాపన

ఉత్పత్తి: ఇథనాల్‌ తయారీ

ఉపాధి: 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా

ప్రయోజనం: గ్రామీణాభివృద్ధి, పరిశుభ్రమైన శక్తి ఉత్పత్తి దిశగా ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది, భారతదేశ జీవ ఇంధన మిషన్‌కు ఇది కీలకం కానుంది. పర్యావరణ పరిరక్షణ, ఇంధన స్వావలంబన దిశగా ముందడుగు.

- పెళ్లకూరు, ఆంధ్రజ్యోతి

ప్రారంభోత్సవాలు

కోర్ట్‌యార్డ్‌ బైమారియట్‌ హోటల్‌

ఎక్కడ: తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు వద్ద

పెట్టుబడి: రూ.220 కోట్లు

సామర్థ్యం: 130 గదులతో 5 స్టార్‌ హోటల్‌

ఉపాధి: ప్రత్యక్షంగా, పరోక్షంగా 300మందికి

ఉద్దేశ్యం: తిరుపతికి వచ్చే యాత్రికులకు ప్రపంచస్థాయి ఆతిఽథ్య సేవలు అందించనున్న ఈ ప్రాజెక్ట్‌ పర్యాటకాభివృద్ధికి కృషి

వర్చువల్‌ ప్రారంభం: సీఎం చంద్రబాబుచే

ప్రత్యక్షంగా పాల్గొంది: కమిషనర్‌ ఎన్‌.మౌర్య, ఏపీ జీబీసీ చైర్‌పర్సన్‌ ఎం.సుగుణమ్మ, ఏపీ హ్యాండిక్రాప్ట్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌, తుడా చైర్మన్‌ సి.దివాకర్‌రెడ్డి, ఏపీటీఏ ప్రాంతీయ సంచాలకుడు ఆర్‌.రమణప్రసాద్‌, ఏపీటీడీసీ ఈడీ ఎం.జనార్దన్‌రెడ్డి, ఆర్డీవో రామ్మోహన్‌, టీడీపీనాయకులు ఈశ్వర్‌రెడ్డి, అమిలినేని మధుసూదన్‌నాయుడు, దొండపాటి మునిశంకర్‌నాయుడు, ఆర్‌సీ మునికృష్ణ, చెరుకూరి మధుశేఖర్‌, కత్తి సుధాకర్‌, సాయిరాయల్‌, హరిరామరెడ్డి, ఖలీమ్‌

- తిరుపతిరూరల్‌, ఆంధ్రజ్యోతి

3ఎక్స్‌పర్‌ ఇన్నోవెంచర్‌ ఫార్మా లిమిటెడ్‌

ఎక్కడ: పెళ్లకూరు మండలం పాలచ్చూరు

పెట్టుబడి: రూ.137 కోట్లు

ఉపాధి: 250 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా

ప్రారంభం: సీఎం చంద్రబాబుచే వర్చువల్‌గా

ప్రత్యక్షంగా పాల్గొంది: మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, నాయకులు

ప్రయోజనం: నాణ్యమైన ఔషధ ఆవిష్కరణ, తయారీ, ఉత్పత్తి అభివృద్ధి సేవలు అందిస్తుంది. రవాణా, హోటళ్లు, లాజిస్టిక్స్‌ వంటి రంగాలలో పరోక్షంగా మరెందరికో ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ప్రాంతీయ పారిశ్రామిక వృద్ధికి, ఆర్థికాభివృద్ధికి దోహదం చేయనుంది.

- పెళ్లకూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Nov 12 , 2025 | 01:18 AM