AP DGP: కఠిన చర్యలు తప్పవు
ABN , Publish Date - Nov 04 , 2025 | 03:54 AM
కుల, మత, ప్రాంత విద్వేషాలు పెంచేందుకు ప్రయత్నించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా సోమవారం హెచ్చరించారు.
కుల, మత, ప్రాంత విద్వేషాలు పెంచేవారిని
సహించం.. ఏ దేశంలో దాక్కున్నా వదలం
3 నెలల్లో అంతా సరిదిద్దుతాం: డీజీపీ
కుల, మత, ప్రాంత విద్వేషాలు పెంచేందుకు ప్రయత్నించేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా సోమవారం హెచ్చరించారు. ‘‘ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ, లేనిది ఉన్నట్లు కల్పితాలు సృష్టించి సమాజంలోకి వ్యాప్తిచేసి అలజడి సృష్టించేవారిని మాత్రం వదిలిపెట్టబోం. ఏ దేశంలో దాక్కున్నా పట్టుకుని కచ్చితంగా జైల్లో పెడతాం. ప్రపంచమంతా ఐటీ చట్టాలు మారుతున్నాయి. మనంకూడా కొత్త చట్టాన్ని తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాం. మూడునెలల్లో అంతా సరిదిద్దుతాం.’’ అని పోలీస్ బాస్ హెచ్చరించారు.