పీపీపీపై వైసీపీకి అవగాహన లేదు
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:16 PM
పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్‌షి్‌ప)పై వైసీపీ నాయకులకు ఏ మాత్రం అవగాహన లేదని, దీంతో నీచ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు
బెళుగుప్ప, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): పీపీపీ (పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్‌షి్‌ప)పై వైసీపీ నాయకులకు ఏ మాత్రం అవగాహన లేదని, దీంతో నీచ రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ కన్వీనర్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి మల్లికార్జున తగ్గుపర్తి రాధాకృష్ణ, ఎంపీపీ పెద్దన్న, విరుపాపల్లి రాధాకృష్ణ, ఆవులెన్న సర్పంచ రాములు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు