ఇది రైతు ప్రభుత్వం: విప్
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:30 AM
రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని, సకాలంలో పంటలకు నీరందించిన ఘనత తమ పార్టీకే దక్కిందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
కణేకల్లు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని, సకాలంలో పంటలకు నీరందించిన ఘనత తమ పార్టీకే దక్కిందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం మండలంలోని గంగలాపురం వద్ద వరి పంట ను పరిశీలించిన ఆయన మాట్లాడారు. హెచ్చెల్సీ ద్వారా కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లోని దాదాపు 35 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించి.. రైతులను ఆదుకున్నామన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు లాలెప్ప, ఆనంద్‌రాజ్, ఆది, కళేకుర్తి సుదర్శన, బీటీ రమేష్, బసవరాజు, వన్నారెడ్డి, ప్రభాకర్, చంద్ర శేఖర్‌గుప్తా, చాంద్‌బాషా, అనిల్, కురుబ నాగరాజు ఉన్నారు.