పంచాయతీ నిధులు దుర్వినియోగం
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:54 PM
వజ్రకరూరు మండలం గడేహోతూరు పంచాయతీ పంచాయతీలో తాగునీరు, డ్రైనేజీ పనులకు ఉపయోగించాల్సిన రూ. మూడు లక్షల పంచాయతీ నిధులను వైసీపీ సర్పంచు, కార్యదర్శి కుమ్మక్కై .. అవసరం లేనిచోట మట్టి రోడ్డు వేయించి .. దుర్వినియోగం చేశారని టీడీపీ నాయకుడు వన్నూరుస్వామి మండిపడ్డారు.
వజ్రకరూరు (ఉరవకొండ), డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): వజ్రకరూరు మండలం గడేహోతూరు పంచాయతీ పంచాయతీలో తాగునీరు, డ్రైనేజీ పనులకు ఉపయోగించాల్సిన రూ. మూడు లక్షల పంచాయతీ నిధులను వైసీపీ సర్పంచు, కార్యదర్శి కుమ్మక్కై .. అవసరం లేనిచోట మట్టి రోడ్డు వేయించి .. దుర్వినియోగం చేశారని టీడీపీ నాయకుడు వన్నూరుస్వామి మండిపడ్డారు. తీర్మాణాలు లేకుండానే 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ పనులు చేపట్టారని ఆయన మంగళవారం ధ్వజమెత్తారు. ప్యాపిలి రస్తా నుంచి పాఠశాలకు వెళ్లే రహదారి దెబ్బతిందని, కనీసం దాన్ని అయినా బాగు చేయకుండా.. ఎవరికీ ఉపయోగపడని చోట ఈ రోడ్డు పనులు చేయించారని అన్నారు. సర్పంచు సురేంద్ర, కార్యదర్శి సుబానజీ కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఎంపీడీవో శివాజీరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై కార్యదర్శి సుబానజీని వివరణ కోరగా.. తీర్మాణం చేయలేదని, సర్పంచు వినతి పత్రం ఇవ్వడంతో ఆ రోడ్డు పనులు చేపట్టామని అన్నారు.