Share News

అభివృద్ధికి అమిలినేని కృషి భేష్‌ : ఎంపీలు

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:13 PM

నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చేస్తున్న కృషి అమోఘమని ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్‌ కొనియాడారు.

అభివృద్ధికి అమిలినేని కృషి భేష్‌ : ఎంపీలు
మాట్లాడుతున్న అంబికా, వెంకట శివుడు యాదవ్‌, అమిలినేని, బీకే

కళ్యాణదుర్గం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చేస్తున్న కృషి అమోఘమని ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్‌ కొనియాడారు. మంగళవారం స్థానిక ప్రజావేదికలో వారు మాట్లాడారు. కనకదాసు, వాల్మీకి, వడ్డే ఓబన్న తదితరుల విగ్రహాల ఏర్పాటుతో పాటు.. పలు అభివృద్ధి కార్యాక్రమాలను ఎమ్మెల్యే తన సొంత నిధులతో చేపట్టారన్నారు. ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ.. మంత్రి నారాలోకేష్‌ కళ్యాణదుర్గానికి వస్తుండటం అదృష్టంగా భావిస్తున్నానని, బహిరంగసభకు 40 వేల మందికి పైగా ప్రజలు వస్తున్నారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:13 PM