మరో వయనాడ్‌గా విజయవాడ..
ABN, Publish Date - Sep 04 , 2024 | 01:54 PM
అమరావతి: వయనాడ్‌కు మించిన విలయం విజయవాడను అతలాకుతలం చేసింది. బుడమేరు రూపంలో నగర శివారు ప్రాంతాలు మొత్తాన్ని ముంచెత్తింది. కృష్ణా నదికి గతంలో ఎన్నడూ లేని విధంగా 11 లక్షల క్యూసెక్కులకుపైగా వరదనీరు వచ్చింది. కానీ కృష్ణా జలాల కంటే బుడమేరు రూపంలో ఎక్కువ విజయవాడ నగరానికి నష్టం కలిగింది.
అమరావతి: వయనాడ్‌కు మించిన విలయం విజయవాడను అతలాకుతలం చేసింది. బుడమేరు రూపంలో నగర శివారు ప్రాంతాలు మొత్తాన్ని ముంచెత్తింది. కృష్ణా నదికి గతంలో ఎన్నడూ లేని విధంగా 11 లక్షల క్యూసెక్కులకుపైగా వరదనీరు వచ్చింది. కానీ కృష్ణా జలాల కంటే బుడమేరు రూపంలో ఎక్కువ విజయవాడ నగరానికి నష్టం కలిగింది. ఇంకా మోకాలలోతు నీటిలో అనేక కాలనీలు ఉన్నాయి. సుమారు 10 నుంచి 15 వార్డులు వరద ముంపుకు గురయ్యాయి.
ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ.. దాతలు ముందుకు వస్తున్నా.. ఇంకా ఆదుకునేవారి కోసం, సహాయక చర్యల కోసం బాధితులు ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. అందరికీ సాయం అందడంలేదు. కొన్ని ప్రాంతాల్లో చుట్టుముట్టిన నీరు.. మరోవైపు పవర్ సరఫరా లేకపోవడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. వయనాడ్‌లో ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది.. అయితే విజయవాడలో ఆ స్థాయిలో ప్రాణ నష్టం లేకపోయినా.. ఇళ్లు, ఆస్తులు.. ఇలా సర్వం కోల్పోయారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌కు 24 గంటల్లో మరో ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్లకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే భారీ వర్షాలకు బుడమేరు పొంగి విజయవాడ జలదిగ్బంధంలో చిక్కుకుంది. మళ్లీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాబోయే 3, 4 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈనెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
కాగా విజయవాడ, గుంటూరు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారుల్లో ఆందోళన నెలకొంది. నిన్న (మంగళవారం) సాయంత్రం నుంచి ఆకాశం మేఘవృతం కావడంతో వరద పీడిత ప్రాంతాల ప్రజల్లో భయం నెలకొంది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న సాయంత్రానికి కొంతమేర వరద నీరు తగ్గింది. మళ్ళీ తెల్లవారు జాము నుంచి వర్షం పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ నేతలకు హై కోర్టు బిగ్ షాక్..
హుస్నాబాద్‌లో భారీ వర్షాలు (ఫోటో గ్యాలరీ)
1700 గదుల రాజభవనం.. 7వేల లగ్జరీ కార్లు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 04 , 2024 | 01:54 PM