కేటీఆర్ రా.. తప్పెవరిదో తేల్చుదాం : మంత్రి సీతక్క

ABN, Publish Date - Nov 28 , 2024 | 02:02 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి సీతక్క సవాల్ చేశారు. దిలావార్ పూర్‌కు కేటీఆర్ రావాలని.. తాను వస్తానని తప్పెవరిదో తేల్చుకుందామని సవాల్ చేశారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి సీతక్క సవాల్ చేశారు. దిలావార్ పూర్‌కు కేటీఆర్ రావాలని.. తాను వస్తానని తప్పెవరిదో తేల్చుకుందామని సవాల్ చేశారు. ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులపై మంత్రి గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దిలావర్ పూర్ ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు బీఆర్ఎస్ నాయకులే ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పును తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇథనాల్ కంపెనీ పర్మిషన్ కాపీలో కేసీఆర్, కేటీఆర్ సంతకాలు ఉన్నాయన్నారు. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కొడుకు తలసాని సాయి ఉన్నారని, తలసాని కొడుకు గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని, దమ్ముంటే కేటీఆర్ దిలావర్ పూర్ రావాలని మంత్రి సీతక్క మరోసారి సవాల్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో చాలా మార్పులు వచ్చాయి

ఆ ఇద్దరి మధ్య కొలిక్కి రాని చర్చలు

ఇంకా అజ్ఞానంలోనే రాంగోపాల్ వర్మ..

పిఠాపురానికి చెందిన మరో కార్మికుడు మృతి

ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ

దేనికి విజయోత్సవాలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 28 , 2024 | 02:02 PM