ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ.. మంత్రి వర్గ విస్తరణపై చర్చలు
ABN, Publish Date - Oct 01 , 2024 | 01:31 PM
సీఎం రేవంత్: రెడ్డి ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సమావేశం ముగిసింది. తర్వాత ఐఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సమావేశం ముగిసింది. తర్వాత ఐఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఖర్గేను సీఎం మర్యాదపూర్వకంగా కలిసారు. అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిపినట్లు సమాచారం.
మరోవైపు పార్టీలో నూతన పీసీపీ ఎంపిక జరిగిన తర్వాత కమిటీలకు సంబంధించిన అంశాల్లో ఇంకా క్లారిటీ రాలేదు. ఆ కమిటీలను కూడా నియమించాల్సిందిగా.. పీసీసీని అదే విధంగా ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అనే అంశాలను కూడా ఏఐసీసీ జనరల్ సెక్రటరీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అలాగే కేబినెట్ విస్తరణకు సంబంధించి చర్చలు జరిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత..
కర్నాటకలో ఏడీజీ వర్సెస్ కుమారస్వామి
నటుడు గోవింద ఇంట్లో గన్ మిస్ ఫైర్ ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Oct 01 , 2024 | 01:31 PM