ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిరిజనులతో సీఎం చంద్రబాబు థింసా నృత్యం..

ABN, Publish Date - Aug 09 , 2024 | 01:27 PM

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివాసీ దినోత్సవానికి చంద్రబాబు హాజరై గిరిజనులతో మమేకమయ్యారు. పాడేరు గిరిజన కళాకారుల సంప్రదాయ థింసా నృత్యంలో పాల్గొని వారితో కలిసి స్పెప్పులేశారు. గిరిజనులతో కలిసి సందడి చేశారు.

విజయవాడ: అంతర్జాతీయ గిరిజన దినోత్సవం (International Tribals Day) సందర్భంగా గిరిజనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సామాజిక మాధ్యమం ఎక్స్ (X) వేదికగా శుభాకాంక్షలు (Congratulate) తెలియజేశారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం (Tummalapally Kalakshetram)లో ఆదివాసీ దినోత్సవానికి చంద్రబాబు హాజరై గిరిజనులతో (Tribels) మమేకమయ్యారు. పాడేరు గిరిజన కళాకారుల సంప్రదాయ థింసా నృత్యంలో(Thimsa Dance) పాల్గొని వారితో కలిసి స్పెప్పులేశారు. గిరిజనులతో కలిసి సందడి చేశారు. ఆ తర్వాత డప్పు కొట్టి గిరిజనులను ఉత్సాహ పరిచారు. వివిధ వేషధారణలతో వచ్చిన వారితో ముచ్చటించారు.


అనంతరం ఆదివాసీల జీవనశైలికి సంబంధించిన పనిముట్లతో ఎర్పాటు చేసిన ప్రదర్శనను సీఎం చంద్రబాబు తిలకించారు. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులు.. వాటి వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అడవి నుంచి వచ్చే కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్ ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ఎక్కువ డిమాండ్ ఉంది. కాగా గిరిజన తేనెను చంద్రబాబు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాలిఫోర్నియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన దృశ్యాలు..

ఆ ఐదేళ్లూ.. దుర్భరం

టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీలో నిర్ణయాలు ఇవే..

విద్యుత్‌పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

తెలంగాణకు పెట్టుబడుల వెళ్లువ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 09 , 2024 | 01:29 PM

Advertising
Advertising