చంద్రబాబుకు దండం పెడుతున్న చిన్నారి...
ABN, Publish Date - Apr 08 , 2024 | 07:05 AM
కృష్ణాజిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గ కేంద్రం, పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో జరిగిన భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు.
కృష్ణాజిల్లా: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లా, పామర్రు నియోజకవర్గ కేంద్రం, పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో జరిగిన భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని, ధాన్యం కొనుగోలు చేయడం లేదని, దుర్మార్గుడైన జగన్ సంపదను సృష్టించకుండా అప్పులు చేసి పంపకాలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, సంపద సృష్టించడం రాదని, విధ్వంసమే ఆయన నైజమంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఓ చిన్నారి చంద్రబాబుకు దండం పెట్టడాన్ని అందరినీ ఆకట్టుకుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Apr 08 , 2024 | 07:05 AM