Share News

శ్రీకాంతాచారిని చంపింది నువ్వే!

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:26 AM

‘హరీశ్‌రావు.. నీకు పెట్రోల్‌ దొరుకుతది గానీ అగ్గిపెట్టె దొరకదా? మా శ్రీకాంతాచారిని నువ్వే చంపినవ్‌!మలిదశ తెలంగాణ ఉద్యమంలో దొంగ దీక్షలు చేసి, నాటకాలు ఆడటం తప్ప కేసీఆర్‌

శ్రీకాంతాచారిని చంపింది నువ్వే!

పెట్రోల్‌ దొరికింది గానీ అగ్గిపెట్టె దొరకదా?

హరీశ్‌పై మంత్రి కోమటిరెడ్డి ధ్వజం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ‘‘హరీశ్‌రావు.. నీకు పెట్రోల్‌ దొరుకుతది గానీ అగ్గిపెట్టె దొరకదా? మా శ్రీకాంతాచారిని నువ్వే చంపినవ్‌!మలిదశ తెలంగాణ ఉద్యమంలో దొంగ దీక్షలు చేసి, నాటకాలు ఆడటం తప్ప కేసీఆర్‌ చేసిందేముంది?తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలు కలిసి ఉద్యమం చేస్తే... కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, ఇందులో కేసీఆర్‌కు సంబంధమే లేదు’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ 25 పార్లమెంటు స్థానాలు ఉన్న ఏపీలో పార్టీ నష్టపోయినా పర్లేదనుకొని.. ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల కల నెరవేర్చిన దేవత సోనియాగాంధీ అని ఒక సందర్భంలో కేసీఆరే అన్నారని గుర్తు చేస్తూ.. తెలంగాణ తెచ్చింది కేసీఆరేనంటూ హరీశ్‌ మాట్లాడడం సరికాదన్నారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌ అన్నారో? లేదో? ఆయన్నే అడిగి తెలుసుకోవాలని హరీశ్‌కు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్‌ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నపుడే... 41 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరూతూ అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్‌ కంటే ముందే తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నేతలు పోరాటాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిదని అన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 04:26 AM