Share News

Yashoda Hospitals: వరద బాధితులకు యశోదఆస్పత్రి కోటి విరాళం

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:02 AM

భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైన నేపథ్యంలో నగరంలోని యశోద గ్రూప్‌ హాస్పిటల్స్‌ నిర్వాహకులు స్పందించారు.

Yashoda Hospitals: వరద బాధితులకు యశోదఆస్పత్రి కోటి విరాళం

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైన నేపథ్యంలో నగరంలోని యశోద గ్రూప్‌ హాస్పిటల్స్‌ నిర్వాహకులు స్పందించారు. వరద బాధితులకు రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. యశోద ఆస్పత్రి ఆపరేషన్స్‌ చీఫ్‌ ఆఫీసర్‌ శ్రీనివా్‌సరెడ్డి బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి చెక్కును అందజేశారు. ఆపద కాలంలో దాతృత్వాన్ని చాటుకున్న యశోద హాస్పిటల్స్‌ చైర్మన్‌ రవీందర్‌రావు, డైరెక్టర్లు సురేందర్‌రావు, దేవేందర్‌రావులను భట్టి అభినందించారు.

Updated Date - Sep 05 , 2024 | 04:03 AM