Share News

Warangal: వరంగల్‌లో దారుణం.. మహిళ ఆత్మహత్య

ABN , Publish Date - Oct 27 , 2024 | 09:07 PM

వరంగల్‌లో ఓ మహిళ పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైంది. ఈ విషయాన్ని బంధువులకు తెలిపింది. వారంతా కలిసి నిర్వాహకులను నిలదీశారు. ఆ క్రమంలో మహిళ బంధువులపై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది.

Warangal: వరంగల్‌లో దారుణం.. మహిళ ఆత్మహత్య

వరంగల్, అక్టోబర్ 27: వరంగల్ నగర శివారులోని ఓ ప్రైవేట్ పోలీస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో దారుణం చోటు చేసుకుంది. అందులో విధులు నిర్వహిస్తున్న వివాహితపై నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో నిర్వాహకులను వివాహిత బంధువులు నిలదీశారు. ఈ నేపథ్యంలో వివాహిత బంధువులపై నిర్వాహాకులు దాడికి తెగబడ్డారు. దాంతో బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురై.. ఆత్మహత్య చేసుకుంది.

Also Read: AndhraPradesh: ఆమ్రపాలికి కీలక పోస్టింగ్

Also Read: MahaRastra: మిగిలింది 48 గంటలే.. కొలిక్కి రాని పంచాయితీ


ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇక బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే పోలీస్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Also Read: Tamilnadu Politics: ఎన్టీఆర్ స్పూర్తితోనే.. విజయ్ సంచలన వ్యాఖ్యలు


ఇటీవల కాలంలో..

లైంగిక వేధింపుల ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువుగా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటిస్తున్నప్పటికీ ఘటనలు తగ్గడంలేదు. ఇటువంటి ఘటనలతో మహిళలు మరింత ఆందోళన చెందాల్సి వస్తోందని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలని కొద్ది రోజులుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. లైంగిక వేధింపులు, అత్యాచార, హత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఎన్నో కఠిన చట్టాలు తీసుకొస్తున్నా నేరాల సంఖ్య అదుపులోకి రావడంలేదు. తాజా వరంగల్ ఘటన నేపథ్యంలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

Also Read: Telangana Politics: శుద్ధపూసలా మాట్లాడుతున్న కడియం శ్రీహరి

Also Read: రోజు బీరు తాగుతున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలు గ్యారంటీ..


వేధింపులు తాళలేక..

కొందరు మహిళలు లైంగిక వేధింపుల ఘటనలను బయటకు చెప్పుకోలేక తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి నిదర్శనం తాజా వరంగల్ ఘటన. బయటకు చెప్పుకుంటే తమ పరువు పోతుందనే ఆలోచనతో కొందరు మహిళలు లోలోపల బాధపడుతూ.. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహారించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read: Viral Video: భలే వాడివి బాసు: చేతులు లేవు... కానీ బండి నడిపి.. ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు

Also Read: AP Politics: జగన్‌కి ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ?

For Telangana News And Telugu News

Updated Date - Oct 27 , 2024 | 09:19 PM