TSAT: ఐటీ ఉద్యోగ సాధనకు టీసాట్‌లో నేటి నుంచి శిక్షణ
ABN , Publish Date - Nov 30 , 2024 | 04:26 AM
ఐటీ రంగంలో ఉద్యోగాలు సాధించేందుకు కావాల్సిన నైపుణ్యాలపై టీసాట్‌లో ప్రత్యేక ప్రసారాలు చేస్తున్నట్టు టీసాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఐటీ రంగంలో ఉద్యోగాలు సాధించేందుకు కావాల్సిన నైపుణ్యాలపై టీసాట్‌లో ప్రత్యేక ప్రసారాలు చేస్తున్నట్టు టీసాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఐటీ ఉద్యోగాల్లో ప్రధాన భూమిక పోషించే చిప్ డిజైనింగ్, ప్రొడక్షన్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు ప్రత్యేక అవగాహన కల్పించాలని ఈ ప్రసారాలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా శనివారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతి శనివారం టీ-సాట్ నిపుణ చానల్‌లో మర్నాడు (ఆదివారం) విద్య చానల్‌లో రాత్రి 7-8 గంటలకు కార్యక్రమాలు ప్రసారమవుతాయన్నారు. ఏప్రిల్ 26 వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.