Share News

Kumaram Bheem Asifabad- ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి

ABN , Publish Date - Oct 01 , 2024 | 10:32 PM

ఉపాధ్యాయుల నియామకం కోసం డీఎస్పీలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని డీఈవో యాదయ్య అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎంఈవోలు, హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం కోసం ధ్రువపత్రాల పరిశీలన కోసం జిల్లాలో అనుభవజ్ఞనులైన ఎంఈవోలు, హెచ్‌ఎంలను ఏర్పాటు చేశామని చెప్పారు.

Kumaram Bheem Asifabad-  ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి
మాట్లాడుతున్న డీఈవో యాదయ్య

ఆసిఫాబాద్‌, అక్టోబరు 1: ఉపాధ్యాయుల నియామకం కోసం డీఎస్పీలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని డీఈవో యాదయ్య అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎంఈవోలు, హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం కోసం ధ్రువపత్రాల పరిశీలన కోసం జిల్లాలో అనుభవజ్ఞనులైన ఎంఈవోలు, హెచ్‌ఎంలను ఏర్పాటు చేశామని చెప్పారు. అభ్యర్థులు ఒరిజనల్‌తో పాటు రెండు సెట్ల జిరాక్సు అటెస్టెడ్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఎక్కువ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు తాము వద్దనుకున్న పోస్టుకు సంబంఽ దించిన డిక్లరెషన్‌ ఇవ్వాలన్నారు. విద్యశాఖ ద్వారా మెసెజ్‌ లేదా మెయిల్‌ ద్వారా సందేశాలు వస్తాయని చెప్పారు. ఆ సందేశాలకు సంబంధించిన ప్రింటెంట్‌ కాపీని కూడా తీసుకురావాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలనలో పొరపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో పరీక్షల సహాయ కమిషనర్‌ ఉదయ్‌బాబు, జిల్లా సైన్స్‌ అధికారి మధుకర్‌, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా స్థాయి సైన్స్‌ డ్రామా ఫెస్టివల్‌ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జన్కాపూర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులకు మంగ ళవారం డీఈవో యాదయ్య ప్రశంసాపత్రాలు, మెమోంటోలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఉదయ్‌బాబు, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, రాజేష్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 10:33 PM