విద్యా విప్లవానికి నాంది
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:20 PM
యంగ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో తెలం గాణలో విద్యావిప్లవం రాను న్నదని పార్లమెంట్ సభ్యుడు మల్లురవి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డిలు అన్నారు.
- ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డిల వెల్లడి
- తూడుకుర్తిలో రెసిడెన్షియల్ పాఠశాల పనుల పరిశీలన
నాగర్‌కర్నూల్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : యంగ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో తెలం గాణలో విద్యావిప్లవం రాను న్నదని పార్లమెంట్ సభ్యుడు మల్లురవి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డిలు అన్నారు. మండలంలోని తూడుకుర్తి గ్రామంలో నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణ పనులను ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్‌లతో కలిసి వారు ఆదివారం పరిశీలించారు. తూడుకుర్తి గ్రామ శివారులోని సర్వే నెంబరు 816లో 25 ఎక రాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ తెలంగాణ ప్ర భుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జాతీయ సమై క్యతను పెంపొందించేలా అన్ని కులాల విద్యార్థు లు ఒకే దగ్గర చదువుకోవడానికి ఈ స్కూళ్లు ఎంతో దోహదపడుతాయన్నారు.ఎమ్మెల్సీ దామో దర్‌రెడ్డి మాట్లాడుతూ దాదాపు 4వేల మంది విద్యార్థులు చదువుకునేలా వసతిగృహంతో పా టు పాఠశాల నిర్మాణ పనులు జరుగుతున్నా యని తెలిపారు. పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన వారిలో డీసీసీబీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కూచకుళ్ల నరసింహారెడ్డి, కోటయ్య యాదవ్ ఉన్నారు.