పట్టణాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:42 PM
నల్లగొండ పట్టణంలో పార్టీలకతీతంగా సుమారు రూ.96 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, దీ నికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మునిసిపల్ చైర్మన బుర్రి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.
పట్టణాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం
మునిసిపల్ చైర్మన బుర్రి శ్రీనివా్‌సరెడ్డి
రామగిరి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ పట్టణంలో పార్టీలకతీతంగా సుమారు రూ.96 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, దీ నికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మునిసిపల్ చైర్మన బుర్రి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో శుక్రవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు 24 గంటల పాటు సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేందుకు మంచినీటి శుద్ధి కేంద్ర నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. టీయూఎ్‌ఫఐడీసీ పనులు అన్ని వార్డుల్లో ప్రారంభించాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేసిన తరుణంలో కొంతసేపు కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా చైర్మన శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడారు రాజకీయాలకతీతంగా నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా విలీన గ్రామల నుంచి సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికే 11 వా ర్డుల్లో పనులు సాగుతున్న ట్లు ఆయన వివరించారు. కొందరు రాజకీయాలు చే యడం కోసం వ్యక్తిగత వి మర్శలు చేయడం తగదని సూచించారు. పట్టణ ప్రజలకు నిరంతరం తాగునీరు అందించాలని మంత్రి వెం కట్‌రెడ్డి సంకల్పంతో 70 ఎంఎల్‌డీల నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసేందుకు రూ.96 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి డీపీఆ ర్ పంపించినట్లు తెలిపారు. మరో పక్క ఇటీవల ప్ర భుత్వం మంజూరు చేసిన రూ.109 కోట్లతో మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించిన ట్లు పేర్కొన్నారు. సమస్య ఎక్కడ ఉన్నా వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. వైస్‌చైర్మన రమే్‌షగౌడ్ మాట్లాడుతూ గత పా లకవర్గం సమయంలో మాజీ ఎమ్మెల్యే హయాంలో ప నుల మంజూరుపై నోరెత్తకుండా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. సమావేశంలో మునిసిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అ హ్మద్, బీజేపీ మునిసిపల్ ఫ్లోర్‌లీడర్ బండారు ప్ర సాద్, పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.