కేసీఆర్ వల్లే తెలంగాణ ఏర్పాటు
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:00 AM
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దీక్ష, ఉద్యమం చేప ట్టడం వల్లే తెలంగాణ స్వరాష్ట్రం సాకార మైం దని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ తెలిపారు.
- మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్
కల్వకుర్తి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దీక్ష, ఉద్యమం చేప ట్టడం వల్లే తెలంగాణ స్వరాష్ట్రం సాకార మైం దని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ తెలిపారు. కల్వకుర్తి పట్టణంలోని త హసీల్దార్ కార్యాలయం ముందు అమరవీరు ల స్తూపానికి దీక్ష దీవస్‌ను పురస్కరిం చుకుని స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్య క్రమంలో మునిసిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, పీఏసీఎస్ చైర్మన్ తలసాని జనార్దన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ ద్యాప విజితారెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విజయ్‌గౌడ్, నాయకులు సూర్య ప్రకాశ్, మధు తదితరులు పాల్గొన్నారు.
దీక్షతో జనజాగృతం చేసిన కేసీఆర్
అచ్చంపేటటౌన్ : మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆమరణ దీక్షతో తిరుగులేని అస్త్రం సంధించి ప్రతీ తెలంగాణ బిడ్డను ఉద్య మంలో మమేకం చేసింది కేసీఆర్ అని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు శంకర్ అన్నారు. దీక్షా దీవస్ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు రాజిరెడ్డి, వెంకటయ్య, అంజి, రవీందర్ నాయకులు పాల్గొన్నారు.
కోడేరు మండలంలో..
కోడేరు : దీక్ష దివస్‌లో భాగంగా బీఆర్ ఎస్ నాయకులు మండల కేంద్రంలో తెలంగా ణ కోసం అసువులు బాసిన శ్రీకాంత్ చారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. అనంతరం బస్టాండ్ సెంటర్‌లో అంబే డ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీశైలం, విద్య, రాజు, ఆర్కే రామ కృష్ణ, యాపచెట్టు లాలు, ఆది సోమనా త్, బొట్టు వెంకటస్వామి, మాజీ సర్పంచు నాగులపల్లి రాములు, వీరపాగ వెంకటస్వామి, షఫీ, సాయిబాబా, రాముడు, భజన జంపుల మహేష్, వెంకటేష్ పాల్గొన్నారు.