ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుసేని

ABN, Publish Date - Feb 17 , 2024 | 04:05 AM

వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుసేని ఎన్నికయ్యారు. చైర్మన్‌ను ఎన్నుకునేందుకు వక్ఫ్‌బోర్డు డైరెక్టర్లు శుక్రవారం హజ్‌హౌ్‌సలో సమావేశమయ్యారు. చైర్మన్‌గా పోటీలో ఆయన ఒక్కరే ఉండటం,

హైదరాబాద్‌, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుసేని ఎన్నికయ్యారు. చైర్మన్‌ను ఎన్నుకునేందుకు వక్ఫ్‌బోర్డు డైరెక్టర్లు శుక్రవారం హజ్‌హౌ్‌సలో సమావేశమయ్యారు. చైర్మన్‌గా పోటీలో ఆయన ఒక్కరే ఉండటం, డైరెక్టర్లంతా మద్దతు పలకడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. హైదరాబాద్‌ మల్లెపల్లికి చెందిన హుసేని 1999-2000లో నిజాం కాలేజిలో ఎన్‌ఎ్‌సయుఐ యూనిట్‌ ప్రెసిడెంట్‌గా కాంగ్రె్‌సతో అనుబంధం ప్రారంభించారు. అనంతరం ఎన్‌ఎ్‌సయుఐలో వివిధ హోదాల్లో పనిచేసి ఉమ్మడి రాష్ట్రంలో కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిగా పనిచేసి.. 2002-06లో రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. యూత్‌ కాంగ్రె్‌సలో రాష్ట్ర కార్యదర్శి నుంచి జాతీయ కార్యదర్శి వరకు ఎదిగారు. 2016 నుంచి 2021 వరకు యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి, జాతీయ అధికార ప్రతినిధిగానూ పనిచేశారు. పీసీసీ ప్రచార కమిటీకి ప్రస్తుతం కన్వీనర్‌గా ఉన్నారు. రాష్ట్రంలో వక్ఫ్‌ భూముల పరిరక్షణ, అన్యాక్రాంతమైన భూముల స్వాధీనంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం పేర్కొన్నారు. చైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Feb 17 , 2024 | 04:05 AM

Advertising
Advertising