Share News

Manchiryāla- ప్రత్యేక పూజలు.. అన్నదానాలు

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:14 PM

జిల్లాలోని పలు చోట్ల ప్రతిష్ఠించిన గణనాథుల వద్ద ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆయా మండపాల్లో నిర్వహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని కాలేజ్‌ రోడ్డులో గల టీచర్స్‌ కాలనీలోని శ్రీ సాయి గణేశ్‌ మండలిలో 108 ప్రసాదాలతో మహిళలు గణనాథుడికి నైవేద్యం సమర్పించారు.

Manchiryāla- ప్రత్యేక పూజలు.. అన్నదానాలు
మంచిర్యాలలో 108 ప్రసాదాలతో వినాయకుని నైవేద్యం సమర్పించిన మహిళలు

మంచిర్యాల, సెప్టెంబరు 15: జిల్లాలోని పలు చోట్ల ప్రతిష్ఠించిన గణనాథుల వద్ద ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆయా మండపాల్లో నిర్వహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని కాలేజ్‌ రోడ్డులో గల టీచర్స్‌ కాలనీలోని శ్రీ సాయి గణేశ్‌ మండలిలో 108 ప్రసాదాలతో మహిళలు గణనాథుడికి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు.

మంచిర్యాల కలెక్టరేట్‌: మొదటి పూజలు అందుకునే వినాయకుడి పూజలు సంస్కృతికి ప్రతీకగా నిలుస్తాయని మంచిర్యాల రామ్‌నగర్‌ అర్చకులు సముద్రాల రమణాచార్యులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వినాయక పూజలను ఘణంగా నిర్వహించారు. విద్యానగర్‌లో వినాయకుడికి 108 ప్రసాదాలు, పండ్లు అభిషేకాలతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తుల మధుసూదన్‌రావు, శ్రీనివాస్‌, మున్నా, దైర్యరావు, మహిళలు పాల్గొన్నారు. కాగా జిల్లా కేంద్రంలో ఆదివారం కుంకుమా ర్చనలు నిర్వహించారు. స్థానిక మండలి నిర్వహకులు, భక్తులు విజయ్‌, రాణి, రాజమల్లు, నాగమణి, శ్రీనివాస్‌, భార్గవి, మౌనిక, అజయ్‌, శ్రీనివాస్‌, స్వప్న, సంతోష్‌, కార్తీక్‌ రజిత, జనార్దన్‌ పాల్గొన్నారు.

దండేపల్లి: దండేపల్లిలో శివగణేశ్‌ భక్త మండలి వినాయక మండలంలో శనివారం రాత్రి 108 దీపాలతో మహిళ భక్తులు దీపారాధన పూజలు చేశారు. బాల గణేశ్‌ వినాయక మండపం వద్ద ఆదివారం మహిళ భక్తులు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. మండలంలోని పలు గణేష్‌ మండపల వద్ద అన్నదాన వితరణ చేపట్టారు.

నెన్నెల: మండల కేంద్రంలోని గంగపుత్ర గణేశ్‌ మండలి, కొండువాడ మండళ్లలో కొలువు దీరిన గణనాథుడికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేశ్‌ ఉత్సవ సమితి సభ్యులు ఎంపీకి ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్‌ నాయకులు ఎంపీని శాలువాలతో సన్మానించారు. మండల సమస్య లను ఎంపీ దృష్టికి తీసుకెల్లి పరిష్కరించాలని కోరారు. ఎంపీ సానుకూలంగా స్పందిం చారని నాయకులు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు గట్టు మల్లేష్‌, నాయకులు హరీష్‌గౌడ్‌, తోట శ్రీనివాస్‌, మల్లాగౌడ్‌, రాజశేఖర్‌ ఉన్నారు.

మందమర్రి రూరల్‌: మండల పలు గణనాథుడి మండపాల వద్ద హోమాలు, అన్నదానాలు నిర్వహించారు. బాలవరసిద్ధి వినాయక మండలి వద్ద హోమం నిర్వహించి అన్నదానం చేశారు.

Updated Date - Sep 15 , 2024 | 11:14 PM