Share News

సేవా కార్యక్రమాలు అభినందనీయం

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:18 PM

సగర సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పాలమూరు నియోజకవర్గ ఎంపీ డీకే అరుణ అన్నారు.

సేవా కార్యక్రమాలు అభినందనీయం
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్న ఎంపీ డీకే అరుణ

- సగర విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల పంపిణీలో ఎం.పీ. డీకే అరుణ

పాలమూరు/ మహబూబ్‌నగర్‌ టౌన్‌, సెప్టెంబరు 15 : సగర సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పాలమూరు నియోజకవర్గ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం ఏనుగొండలోని సగర కమ్యూనిటీ హాల్‌లో సగర సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఆమె ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ లోకంలో చదువుకు మించిన ఆస్తిలేదని, చదువు ఒకరు దోచుకెళ్లే సొత్తుకాదని, ఇలాంటి ప్రోత్సాహకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్వతహాగా తమ కాళ్ల మీద తాము నిలబడేలా విద్యార్థులు చదివి ఎదగాలని, తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించాలని అన్నా రు. కేంద్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న విశ్వకర్మ లోన్స్‌ వంటి ప్రతీ పథకాన్ని వి ద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజకీయాల్లో డబ్బు కీలకంగా మారిందని, కానీ మేము 70 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ మాకు ఆ అవసరం రాలేదని తెలిపారు. ఏ సమస్యతో వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉన్నాను కాబట్టే నన్ను ప్రజలు ఎంపీగా ఆదరించారని అన్నారు. సగర సంఘం సేవా కార్యక్రమాల్లో తన వంతు సహకారం అందించేందుకు ముందుంటానని తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కష్టపడ్డవారికి భవిష్యత్తు బంగారు మయమవుతుందన్నారు. చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో కష్టపడి చదివితే మంచి జీవితం లభిస్తుందని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉప్పరి శేఖర్‌, జిల్లా అధ్యక్షుడు, ప్రనీల్‌చంద్‌, సత్యం, పర్వతాలు, నారాయణ, గోపాల్‌, బీసీ సమాజ్‌ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌, సవారి సత్యం పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:18 PM