వృద్ధురాలిపై అఘాయిత్యం
ABN , Publish Date - Oct 30 , 2024 | 12:04 AM
ఒంటరిగా ఉన్న 60 ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన వృద్ధురాలు నీరసంగా కనిపిస్తుండటంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఆలస్యంగా వెలుగులోకి.. నిందితుడిపై కేసు
తలకొండపల్లి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఒంటరిగా ఉన్న 60 ఏళ్ల వృద్ధురాలిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన వృద్ధురాలు నీరసంగా కనిపిస్తుండటంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ కథనం మేరకు తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలికి ముగ్గురు సంతానం. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఇది గమనించి ఆమె ఇంటి పక్కన ఉండే రమేష్(40) అనే వ్యక్తి వారం రోజుల క్రితం వృద్ధురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే, ఆమె నీరసంగా ఉంటుండటంతో ఆసుపత్రికి వెళ్లింది. ఈక్రమంలో ఆమె కోడలు ఏం జరిగిందని ప్రశ్నించగా రమేష్ అనే వ్యక్తి తనపై లైంగికదాడికి పాల్పడినట్లు చెప్పింది. మంగళవారం వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు రమేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.