Share News

కలెక్టరేట్‌లో ‘వార్తల్యాప్‌’ వర్క్‌షాప్‌

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:18 AM

మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో బుధవారం పత్రిక సమాచారంపై వార్తల్యాప్‌ మీడియా వర్క్‌షా్‌పను నిర్వహించారు.

కలెక్టరేట్‌లో ‘వార్తల్యాప్‌’ వర్క్‌షాప్‌
మాట్లాడుతున్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌

మేడ్చల్‌, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో బుధవారం పత్రిక సమాచారంపై వార్తల్యాప్‌ మీడియా వర్క్‌షా్‌పను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు చేసే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసేలా చూడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న ప్రజాసంక్షేమ పథకాలు పేదలకు చేరేలా చూడాల్సి బాధ్యత అధికారులదేనని, ఆ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాయా? లేదా? అని నిర్ధారించుకుని వార్తలు రాయాల్సిన బాధ్యత మాత్రం పాత్రికేయులదేనన్నారు. కలెక్టర్‌ గౌతమ్‌ మాట్లాడుతూ పీఐబీ(వార్తల్యాప్‌) మీడియా వర్క్‌ షాప్‌ ఏ విధంగా పనిచేస్తుంది? మీడియాకు సమాచారం ఎలా ఇవ్వాలి? ఎన్ని భాషల్లో సమాచారాన్ని పత్రికలకు, మీడియాకు చేరవేయాలి? అనే అంశాలపై వివరించారు. ప్రతీ జర్నలిస్ట్‌ ఈ వార్తల్యా్‌పను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీఐబీ లాంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నేడు మన మధ్యకు వచ్చి జిల్లా స్థాయిలో వర్క్‌షా్‌పలను నిర్వహిస్తోందని ఇందుకు పీఐబీ బృందాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సమాచార కార్యాలయం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తోందని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కచ్చిత సమాచారాన్ని ప్రజలకు, మీడియాకు చేరవేయడంలో పత్రికా సమాచార కార్యాలయం ముఖ్య భూమిక పోషిస్తోందని తెలంగాణ రాష్ట్ర అదనపు డైరెక్టర్‌ జనరల్‌ శ్రుతిపాటిల్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, వివేకానంద, డీఆర్‌ పీఐబీ సంపత్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:18 AM