Share News

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్మ

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:53 PM

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్మ

మూడుచింతలపల్లి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిన వివరాలిలా ఉన్నాయి. మజీద్‌పూర్‌ గ్రామానికి చెందిన వినయ్‌రాజు(23) ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిన కొద్దిసేపటికి వినయ్‌రాజు తండ్రి మజీద్‌పూర్‌లోని తన పొలం దగ్గరికి వెళ్లగా బైక్‌ కనిపించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకగా హనుమకుంట పక్కన ఉన్న ఒక చెట్టుకి కరెంట్‌ కేబుల్‌ వైర్‌తో ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Oct 20 , 2024 | 11:53 PM