రెండు బైక్‌లు ఢీ.. మహిళ మృతి
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:14 AM
అతివేగంగా వచ్చిన బైకు మరో బైకును ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.
పూడూరు, సెప్టెంబర్ 1 : అతివేగంగా వచ్చిన బైకు మరో బైకును ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా బుధేరాకు చెందిన మన్నె రాంచంద్రయ్య కూతురు లావణ్య(33), అల్లుడు కావలి వెంకటేశ బైక్‌పై వెళుతున్నారు. వారు పూడూరు గేటు వద్దకు రాగానే ఓ వ్యక్తి తన బైక్(టీఎ్‌స07ఈపీ3069) అతివేగం, అజాగ్రత్తగానడుపుతూ వచ్చి లావణ్య ప్రయాణిస్తున్న బైక్‌కు ఢీకొట్టాడు. బైక్‌పై ఉన్న లావణ్య, ఆమె భర్త వెంకటేశం కిందపడిపోయారు. తలకు గాయమై లావణ్య అక్కడికక్కడే మృతిచెందగా, వెంకటేశాన్ని ఆసుపత్రికి తరలించారు.