Share News

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:08 AM

ప్రజలకిచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడడం లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తున్న ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి

భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 4: ప్రజలకిచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడడం లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో ఎవరూ అధైర్యపడొద్దని అర్హులైన ప్రతీ రైతుకు మాఫీ అవుతుందన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి 359 మంది లబ్ధిదారులకు రూ.3.74 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. అలాగే 113 మందికి రూ.28.66 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ధరణి పోర్ట్టల్‌తో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు పోతుందన్నారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదల భూములు లాక్కొని అనేక ఇబ్బందులపాలు చేసిందని, కాంగ్రె్‌సది రైతు ప్రభుత్వమని, ఏదైనా రైతులకు న్యాయం చేకూరుస్తుందన్నారు. ఫోర్త్‌సిటీతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయన్నారు. ఆర్డీవో కె.అనంతరెడ్డి, ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్మన్లు నిరంజన్‌రెడ్డి, స్రవంతి, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం తహసీల్ధార్లు సునీతారెడ్డి, ప్రసాద్‌రావు, అయ్యప్ప, ఉప్పరిగూడ ప్యాక్స్‌ చైర్మన్‌ ఏదుల్ల పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:08 AM